దేశంలో రికవరీ రేటు 62.78 శాతం, కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 5,15,385

Coronavirus Cases In India, Coronavirus Deaths In India, Coronavirus In India, Coronavirus in India live updates, Coronavirus Live Updates, Covid-19 Recovery Rate, Covid-19 Recovery Rate Increases In, Covid-19 Recovery Rate Increases in India, India

కరోనా నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలు తగిన ఫలితాలు ఇస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో కోవిడ్ కు చికిత్స పొందుతున్నవారికంటే కోలుకున్న వారి సంఖ్య 2,31,978 ఎక్కువ ఉంది. దీంతో కోవిడ్ నుంచి కోలుకున్నవారి శాతం 62.78% కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 19,870 మంది కోవిడ్ బాధితులు కోలుకోగా, ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 5,15,385 కు చేరింది. ప్రస్తుతం 2,83,407 మంది బాధితులుకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది.

అలాగే దేశంలో కరోనా వైరస్ సోకిన వారిని పరీక్షించేందుకు పరీక్షల సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు భారతీయ వైద్య పరిశోధనామండలి (ఐసిఎంఆర్) చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వ లేబరేటరీల (రియల్-టైమ్ ఆర్.టి-పి.సి.ఆర్, ట్రూ-నాట్, సి.బి-నాట్ ) సంఖ్య తాజాగా 841 కి చేరుకోగా, ప్రైవేట్ లాబొరేటరీస్ సంఖ్య 339 కి పెరిగింది. దీంతో కరోనా పరీక్షలు నిర్వహించే మొత్తం లాబ్స్ సంఖ్య 1180 అయింది. కాగా గడిచిన 24 గంటల్లో 2,82,511 శాంపిల్స్ పరీక్షించారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 1,13,07,002 కు చేరింది.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here