మనీశ్‌ సిసోడియాకు మరో షాక్, స్నూపింగ్ ఆరోపణలపై సీబీఐ విచారణకు కేంద్ర హోంశాఖ అనుమతి

MHA Granted Sanction to CBI to Prosecute Delhi Deputy CM Manish Sisodia in Snooping Case,MHA Granted Sanction,CBI to Prosecute Delhi,Delhi Deputy CM Manish Sisodia,Manish Sisodia in Snooping Case,Mango News,Mango News Telugu,National Politics News,National Politics And International Politics,National Politics Article,National Politics In India,National Politics News Today,National Post Politics,Nationalism In Politics,Post-National Politics,Indian Politics News,Indian Government And Politics,Indian Political System,Indian Politics 2023,Recent Developments In Indian Politics,Shri Narendra Modi Politics,Narendra Modi Political Views,President Of India,Indian Prime Minister Election

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కీలక నేత, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాకు మరో షాక్ తగిలింది. ప్రత్యేకంగా రూపొందించిన ఫీడ్‌బ్యాక్ యూనిట్ (ఎఫ్‌బీయూ) ద్వారా రాజకీయ ప్రత్యర్థులపై స్నూపింగ్ ఆరోపణలకు సంబంధించి మనీష్ సిసోడియాను ప్రాసిక్యూట్/విచారణ చేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అనుమతిని మంజూరు చేసింది. అవినీతి నిరోధక చట్టం, 1988లోని సెక్షన్ 17 ప్రకారం మనీశ్ సిసోడియాపై వచ్చిన స్నూపింగ్ ఆరోపణలపై విచారణ జరిపేందుకు సీబీఐకి అనుమతి మంజూరు చేయబడిందని ఢిల్లీ లెఫ్టినెంట్-గవర్నర్‌ వినయ్ కుమార్ సక్సేనా ప్రిన్సిపల్ సెక్రటరీకు రాసిన లేఖలో హోమ్ శాఖ పేర్కొంది.

ఈ అంశంపై మనీశ్ సిసోడియా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, “మీ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు బనాయించడం బలహీనమైన మరియు పిరికి వ్యక్తికి సంకేతం. ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుతున్న కొద్దీ మాపై మరిన్ని కేసులు పెడతారు” అని పేర్కొన్నారు. వివిధ శాఖల్లో అవినీతి, అక్రమాలను పర్యవేక్షించడం, తనిఖీలు కోసం సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎఫ్‌బీయూలను, ప్రభుత్వం రాజకీయ నిఘా కోసం వాడుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, ఇందులో మనీశ్ సిసోడియా పాత్ర ఉందని సీబీఐ ఇటీవలే పేర్కొంది. మనీశ్ సిసోడియాపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాలని సీబీఐ సిఫార్సు చేసింది. ఈ క్రమంలోనే సిసోడియాపై వచ్చిన ఈ స్నూపింగ్ ఆరోపణలపై సీబీఐ విచారణకు కేంద్ర హోం శాఖ తాజాగా అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 16 =