సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం, రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేసేవారికి రూ.5000 నగదు బహుమతి

Tamil Nadu CM MK Stalin Announces Cash Reward for People who will Help Road Accident Victims, Tamil Nadu Govt Announces New Scheme To Help Road Accident Victims, New Scheme To Help Road Accident Victims, Road Accident Victims, New Scheme, Innuyir Kaappon, Tamil Nadu Govt Announces Innuyir Kaappon New Scheme To Help Road Accident Victims, Innuyir Kaappon New Scheme To Help Road Accident Victims, Tamil Nadu Govt, Tamil Nadu, Tamil Nadu CM MK Stalin, CM MK Stalin, MK Stalin, Innuyir Kaappon Latest News, Innuyir Kaappon Latest Updates, Innuyir Kaappon Live Updates, Chief Minister’s Comprehensive Health Insurance Scheme, Mango News, Mango News Telugu,

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోడ్డు ప్రమాద బాధితులకు వైద్య సదుపాయాలు వెంటనే అందేలా సహాయపడే వ్యక్తులకు నగదు రివార్డు మరియు ప్రశంసా పత్రాలను అందించనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. ‘రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి వెంటనే సహాయం చేసి గోల్డెన్ అవర్ వ్యవధిలో వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లే వ్యక్తులకు సత్ప్రవర్తన ధ్రువీకరణ పత్రంతో పాటుగా, రూ. 5000 నగదు బహుమతి ఇవ్వబడుతుంది’ అని సీఎం స్టాలిన్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

మరోవైపు రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి మొదటి 48 గంటల్లో ఉచిత వైద్యం అందించేలా ‘ఇన్నుయిర్ కాప్పోన్’ పథకాన్ని సీఎం స్టాలిన్ ఇటీవలే ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 408 ప్రైవేట్ ఆసుపత్రులు మరియు 201 ప్రభుత్వ ఆసుపత్రులు కలిపి మొత్తం 609 ఆసుపత్రుల్లో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికీ గోల్డెన్ అవర్‌లో వైద్యసేవలు అందించి, ప్రాణాలను రక్షించేలా ఆదేశాలు ఇచ్చారు. మొదటి 48 గంటల్లో తమిళనాడుకు చెందిన ప్రమాద బాధితులకే కాకుండా మరియు రాష్ట్ర సందర్శనకు వచ్చి గాయపడిన ఇతర రాష్ట్రాల వారికీ కూడా ఈ పథకం కింద ఉచిత వైద్యం అందించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 18 =