మధ్యప్రదేశ్‌లోని ‘కునో నేషనల్ పార్క్‌’లోకి అరుదైన 8 చిరుతలను వదిలిపెట్టిన ప్రధాని మోదీ

PM Modi Releases 8 Cheetahs in Kuno National Park Madhya Pradesh Today, PM Modi Releases 8 Cheetahs At National Park, PM Modi Releases 8 Cheetahs, PM Narendra Modi, Kuno National Park Madhya Pradesh , Kuno National Park , Mango News , Mango News Telugu, PM Modi Releases 8 Cheetahs in Kuno National Park, PM Modi, PM Modi Madhya Pradesh Tour, PM Modi Latest News And Updates, Kuno National Park

శనివారం జన్మదినం జరుపుకుంటున్న ప్రధాని మోదీ ఈ ఏడాది తన పుట్టినరోజు వేడుకలను వినూత్నంగా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ ‘కునో నేషనల్ పార్క్‌’లో జరుపుకున్నారు. ఈ క్రమంలో పార్క్‌లోకి అరుదైన 8 చిరుత పులులను వదిలిపెట్టారు. ఆఫ్రికా దేశం నమీబియా నుంచి ప్రత్యేక కార్గో విమానంలో తెప్పించబడిన ఈ ఎనిమిది చిరుతలను ఆయన స్వహస్తాలతో వాటికి కేటాయించిన ఎన్ క్లోజర్ లోకి ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమం కోసం ఇటు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం, అటు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ భారీఎత్తున ఏర్పాట్లు పూర్తిచేశాయి. కాగా దేశంలో అంతరించిపోతున్న చిరుపులులను సంరక్షించే ప్రాజెక్టుని ప్రభుత్వం చేపట్టింది. దీనిలో భాగంగా ప్రధాని మోదీ 72వ పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 17న ఉదయం 8 గంటలకు నమీబియా రాజధాని విండ్‌హోక్ నుంచి ప్రత్యేక విమానంలో ఎనిమిది చిరుతలు గ్వాలియర్‌లో దిగాయి.

ఈ ప్రాజెక్టుకు సహకరించిన నమీబియా ప్రభుత్వానికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో చిరుతలు 1952లో భారతదేశం నుండి అంతరించిపోయాయని తెలిపిన ఆయన, మళ్ళీ వాటికి పునర్వైభవం తెస్తామని ప్రకటించారు. సృష్టిలో వన్యప్రాణులు అత్యంత కీలకమని అభిప్రాయపడిన ప్రధాని మోదీ, జీవ వైవిధ్యం, జీవ వైరుధ్యం మధ్య సమతుల్యత ప్రకారతిలో భాగమని వ్యాఖ్యానించారు. కాగా ఈ 8 చిరుతల‌కు రేడియో కాల‌ర్ల‌ను ఇన్‌స్టాల్ చేసి వాటిని శాటిలైట్ ద్వారా అధికారులు మానిట‌ర్ చేస్తారని, అలాగే పార్క్‌లో కూడా మానిట‌రింగ్ బృందాల‌ను ఏర్పాటు చేసి వాటిని నిరంతరం పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు. కాగా వీటిలో ఐదు ఆడ, మూడు మగ చీతాలు ఉన్నాయి. ఆడ చీతాల వయసు రెండు నుంచి ఐదేళ్లు ఉండగా, మగవాటి వయసు 4.5 నుంచి 5.5 ఏళ్లుగా ఉంది. అయితే మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ దీనిపై స్పందించింది. అసలు చీతాలను భారత్‌కు తీసుకురావాలనే ఆలోచన మొదటిగా చేసింది తామేనని, ఈ మేరకు అప్పట్లో ప్రయత్నాలను కూడా ప్రారంభించామని ట్విట్టర్‌లో తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − six =