నాగోబా అనుగ్రహం కోసం మెస్రం వంశీయులు ఏం చేస్తారు?

Nagoba Maha Jatara on 9th February, Maha Jatara on 9th February, 9th February Nagoba Maha Jatara, Nagoba Maha Jatara, 9th February Nagoba Jatara, People of Mesram, Nagoba, Latest Nagoba Maha Jatara News, Nagoba Maha Jatara News Update, Keslapur, Adilabad, Telangana, Mango News, Mango News Telugu
Nagoba Maha Jatara, 9th February Nagoba Jatara, people of Mesram, Nagoba

నాగోబా జాతర వస్తుందంటేనే తెలంగాణలోని ఆదిలాబాద్ ఆదివాసీల తండాలో హడావుడి కనిపిస్తూ ఉంటుంది. అలా ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా మహాపూజకు ముహూర్తం నిర్ణయంచడంతో..  నాగోబాకు సాంప్రదాయ పూజలతో ఆదివారం మహా క్రతువు ప్రారంభమయింది.

మేస్త్రం వంశీయులు ఆదిలాబాద్ కేస్లాపూర్‌లోని నాగోబా జాతర తేదీలను నిర్ణయించారు. పుష్యవాస అమావాస్యను పురస్కరించుకుని.. ఫిబ్రవరి 9 నుంచి మొదలవనున్న కేస్లా పూర్ నాగోబా జాతర ఉత్సవాల కోసం.. జనవరి 21వ తేదీన  ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ సన్నిధిలో మెస్రం వంశీయులు సమావేశమయ్యారు. అనంతరం చెప్పులు లేకుండా కాలినడకన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం గోదావరి నది హస్తినమడుగు ప్రాంతానికి వెళ్లారు.

సుమారు 250 మంది ఆదివాసీ మెస్రం వంశస్థులు 125 కి. మీటర్ల వరకు వివిధ గ్రామాలలో  పాదయాత్రను నిర్వహించి గోదావరి నది నుంచి గంగా జలాలను సేకరించడం ఎన్నో ఏళ్లుగా  ఆనవాయితీగా వస్తోంది. కలశాలతో పవిత్ర గంగా జలాలను  తీసుకువచ్చి..అప్పుడు తమ ఆరాధ్య దైవమైన కేస్లాపూర్ లోని నాగోబాకు అభిషేకం చేయనున్నారు.పవిత్ర గంగాజలంతో తమ ఆరాధ్య దైవం నాగోబాను అభిషేకించడంతో మొదలైన ఈ జాతర, వారం రోజులపాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది.

ఫిబ్రవరి 5 వరకు కాలినడకనే ప్రయాణించి  గంగా జలాలను తీసుకువచ్చి కేస్లాపూర్‌లోని సాంప్రదాయ మర్రిచెట్టుకు కలశాలు కట్టి ఆలయ పూజారి సూచనతో నాగోబాకు అభిషేకిస్తారు. దీనికోసమే జనవరి 21న మెస్రం వంశస్తులంతా సమావేశమై.. మహా పాదయాత్రకు వెళ్లే మార్గం గురించి, ఎక్కడెక్కడ బస చేయాలనే అంశాలపై చర్చించుకున్నారు. ఆ తర్వాత ఆదివారం రాత్రి ఆచారం ప్రకారం మెస్రం వంశస్తులంతా ఇంద్రవెల్లి మండలం కేస్లాగూడలో బస చేశారు.  మరుసటి రోజు అంటే జనవరి 22 వ తేదీ నుంచి నుంచి  హస్తినమడుగు వరకు పాదయాత్ర కొనసాగనుంది.

చెట్టుకొకరు, పుట్టకొకరుగా ఉన్న మెస్రం వంశీయులు ఈ జాతర కోసం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, బీహార్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కెస్లాపూర్‌కు చేరుకుంటారు. గంగాజలాభిషేకం చేస్తున్నప్పుడు   మెస్రం పెద్దలకు ఆదిశేషుడు దర్శనమిస్తారని అక్కడివారు బలంగా నమ్ముతారు. నాగశేషుని దర్శనం తర్వాత మాత్రమే జాతర ప్రారంభమైనట్లు ప్రకటిస్తారు. మట్డితో మెస్రం వంశానికి చెందిన మహిళలు  ఏడు రకాల పాముల పుట్టలను తయారు చేస్తారు. వీటికి జాతర సమయంలో 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. దీంతోనే  మెస్రం వంశీయులకు నాగోబా అనుగ్రహం కలుగుతుందని మెస్రం వంశీయులతో పాటు ఆదివాసులు నమ్ముతారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − twelve =