కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనకు ముందు జమ్మూ కాశ్మీర్‌లో వరుస బస్సు పేలుళ్లు

Mysterious Twin Bus Blasts in Udhampur Ahead of Union Minister Amit Shah Tour of Jammu and Kashmir, Union Minister Amit Shah Tour of Jammu and Kashmir, Mysterious Twin Bus Blasts in Udhampur, Bomb Blasts In Kashmir, Mango News, Mango News Telugu, Union Minister Amit Shah, Amit Shah Jammu and Kashmir Tour, Union Minister Amit Shah Jammu and Kashmir Tour, Union Minister Amit Shah Latest News And Updates, Amit Shah JK Tour, Twin Bus Blasts in Udhampur, Bus Blasts In Jammu and Kashmir Amid Amit Shah Tour, Political News And Live Updates

జమ్మూ కాశ్మీర్‌లో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటనకు ముందు కొన్ని గంటల వ్యవధిలో రెండు బస్సు పేలుళ్లు సంభవించాయి. ఉధంపూర్‌లో చోటుచేసుకున్న ఈ మిస్టీరియస్ జంట పేలుళ్లు ఉద్దేశపూర్వకంగానే జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాగా ఉధంపూర్‌లోని పెట్రోల్ పంపు సమీపంలో డోమైల్ చౌక్‌లో ఆగి ఉన్న బస్సులో బుధవారం రాత్రి 10.30 గంటలకు మొదటి పేలుడు సంభవించిందని వారు వెల్లడించారు. ఈ ఘటనలో ప్రింకా రామ్‌నగర్‌కు చెందిన కండక్టర్ సునీల్ సింగ్ (27) మరియు జగనూకు చెందిన అతని స్నేహితుడు విజయ్ కుమార్ (40) గాయపడ్డారని తెలిపారు. ఆ సమయంలో వారిద్దరూ డ్రైవర్ క్యాబిన్‌లో కూర్చున్నట్లు తెలిసిందని చెప్పారు.

ఇక గురువారం ఉదయం జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ నగరంలోని స్టాండ్‌లో ఆపి ఉంచిన బస్సులో మరో పేలుడు సంభవించింది. తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో జరిగిన పేలుడు ధాటికి బస్సు పైకప్పు, వెనుకభాగం ఎగిరిపోయాయని, అయితే ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. దీంతో అక్కడ హై అలర్ట్‌ ప్రకటించారు. ఈ పేలుళ్లలో రెండు మూడు బస్సులు దెబ్బతిన్నాయని ఉదంపూర్-రియాసి రేంజ్ డీఐజీ సులేమాన్ చౌదరి తెలిపారు. పేలుడు పదార్థాల స్వభావం మరియు ఇతర విషయాలు దర్యాప్తులో ఉన్నాయి. దీనిపై సమగ్ర విచారణ అవసరమని ఆయన అన్నారు. అలాగే గాయపడిన వ్యక్తులను కూడా ప్రశ్నిస్తున్నామని, తీవ్రవాద కోణాన్ని తోసిపుచ్చలేమని ఆయన తెలిపారు. పోలీసులతో పాటు ప్రజలు కూడా అనుమానాస్పద వస్తువుల కోసం తమ వాహనాలను తనిఖీ చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు మరియు ఇతర భద్రతా బలగాల సిబ్బంది బస్టాండ్‌ను చుట్టుముట్టారు. పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచిన ఇతర వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. దీంతోపాటు ఉదయం పేలుడు సంభవించడానికి ముందు బస్టాండ్ నుండి బయలుదేరిన అన్ని వాహనాలను చెక్‌పోస్టుల వద్ద ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేస్తామని కూడా అధికారులు తెలిపారు. కాగా వచ్చే నెల మొదటి వారంలో జమ్మూ కాశ్మీర్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మూడు రోజుల పర్యటనకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో అక్టోబరు 1న రాజౌరీలో అమిత్ షా తొలి కీలక ప్రసంగం చేయనుండగా, అక్టోబర్ 2న బారాముల్లాలో మరో ర్యాలీలో ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ వరుస పేలుళ్ల ఘటన చోటుచేసుకోవడంపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 14 =