టూరిస్ట్ ప్రాంతంగా అభివృద్ది చేయడానికి కేంద్రం కసరత్తు

New Airport In Lakshadweep, Lakshadweep New Airport, Airport In Lakshadweep, Lakshadweep,Airport,For Defense Purposes,New Airport In Lakshadweep, Tourist Area, Latest Airport News In Lakshadweep, Lakshadweep News, Lakshadweep Airport News, New Airport In Lakshadweep, Lakshadweep, Mango News, Mango News Telugu
Lakshadweep,Airport,For defense purposes,New airport in Lakshadweep, tourist area

మూడు రోజులుగా మాల్దీవులను బాయ్ కాట్ చేయాలని నెట్టింట ఓ రేంజ్‌లో ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సమయంలోనే పర్యాటక ప్రేమికుల కోసం నెట్టింట్లో ఓ వార్త వినిపిస్తోంది. లక్షద్వీప్‌లో మరో కొత్త ఎయిర్‌పోర్టును నిర్మించడానికి కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మాల్దీవులను బాయ్‌కాట్‌ చేయాలంటూ  భారత్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న వేళ.. ఈ న్యూస్ మరింత వైరల్ అవుతోంది.

లక్షద్వీప్‌‌లో ప్రధాని మోడీ రీసెంట్‌గా చేసిన టూర్‌ తర్వాత ఈ దీవుల పేరు తెగ మార్మోగుతోంది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా టూరిస్టుల అందరి చూపు ఈ దీవులపైనే పడింది.  గూగులమ్మ సాయం తీసుకుని ఈ దీవుల కోసం  తెగ వెతికేస్తున్నారు. అటు మాల్దీవుల ప్రభుత్వం ఇప్పుడు తమ తప్పును సరిదిద్దుకున్నా కూడా..  కేంద్రం మాత్రం లక్షద్వీప్‌ వైపు చూస్తోంది.

లక్షద్వీప్‌లో టూరిస్టులను ఆకర్షించే విధంగా మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చడానికి మోడీ సర్కార్ సిద్ధమైంది. దీనిలో భాగంగానే అక్కడ కొత్తగా మరో ఎయిర్‌పోర్టును నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మిలిటరీ, వాణిజ్య అవసరాల కోసం ఇప్పటికే మినికోయ్‌లో నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించినట్టు కూడా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఫైటర్‌ జెట్‌లు, సైనిక రవాణా ఎయిర్‌క్రాఫ్ట్‌లతో పాటు వాణిజ్య విమానాల మెయింట్‌నెన్స్ కెపాసిటీ  ఉండేలా డబుల్ బెనిఫిట్స్‌తో  కొత్తగా ఎయిర్‌పోర్టును నిర్మించడానికి  కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మినికోయ్‌ దీవుల్లో ఈ కొత్త ఎయిర్ పోర్టును అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

వాస్తవానికి మినికోయ్‌ దీవుల్లో డిఫెన్స్ రంగ అవసరాల కోసం ఎయిర్‌ఫీల్డ్‌ను నిర్మించడానికి ఇంతకుముందే  ప్రతిపాదనలు వచ్చాయి. అరేబియా, హిందూ మహా సముద్రాల్లో సంఘ వ్యతిరేక కార్యకలాపాలతో పాటు, సముద్రపు దొంగల దాడులు పెరుగుతుండటంతో.. వాటిపై నిఘాను పెంచడానికి ఈ ప్రాంతం మెరుగ్గా ఉపయోగపడుతుందని కోస్ట్‌గార్డ్‌ ఎప్పుడో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.

తాజాగా మాల్దీవులకు వెళ్లడానికి భారత ప్రజలు ఆసక్తి చూపించపోవడం, బాయ్ కాట్ మాల్దీవుల నినాదం ఎక్కువ అవడంతో.. విమాన రాకపోకలు సాగించేలా ఇక్కడ కొత్తగా విమానాశ్రయాన్ని నిర్మించాలని కేంద్రం భావిస్తోంది.  ఇది లక్షద్వీప్ దీవులను టూరిస్ట్ ప్రాంతంగా చేరువ చేయడానికి ఉపయోగపడుతుందని మోడీ సర్కార్ అనుకుంటోంది. లక్షద్వీప్‌లో ప్రస్తుతం ఒకే ఒక్క విమానాశ్రయం ఉంది. అది కూడా 1987-88లో అగత్తి దీవుల్లో ఆ ఎయిర్ పోర్టును నిర్మించగా.. ఆ తర్వాత దశలవారీగా విస్తరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 6 =