ఎమ్మెల్యేలు, ఎంపీల్లో టికెట్ టెన్షన్..

29 YCP leaders, MLAs and MPs Ticket tension , Buggana, Jayaram, MPs Satyavathy, Gorantla Madhav,Thota Trimurtuli, Dwarampudi, Ayodhya Ramireddy, Jonnalagadda Padmavathy, Balineni Srinivas Reddy, Vellampalli Srinivas, Malladi Vishnu, Tellam Balaraju.
29 YCP leaders, MLAs and MPs Ticket tension , Buggana, Jayaram, MPs Satyavathy, Gorantla Madhav,Thota Trimurtuli, Dwarampudi, Ayodhya Ramireddy, Jonnalagadda Padmavathy, Balineni Srinivas Reddy, Vellampalli Srinivas, Malladi Vishnu, Tellam Balaraju.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో… మార్పులు చేర్పుల విషయంలో  వైఎస్ జగన్ మరింత దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే రెండు జాబితాల్లో 40 మంది వరకూ ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చేసిన వైసీపీ అధిష్టానం..మరికొన్ని గంటల్లో 29మందితో మరో జాబితాను విడుదల  చేయబోతోంది. దీనిపై ఇప్పటికే ముఖ్య నేతలతో చర్చించిన సీఎం జగన్‌.. భారీ కసరత్తు చేసి జాబితాను ఫైనల్ చేశారు.

మరోవైపు జగన్ పిలుపుతో కొంతమంది,  విన్నపాలు విన్నవించడానికి మరికొంతమంది నేతలు క్యాంప్‌ ఆఫీసు ముందు క్యూ కట్టారు. మంత్రులు బొత్స, బుగ్గన, జయరాం.. ఎంపీలు సత్యవతి, గోరంట్ల మాధవ్‌తో పాటు తోట త్రిమూర్తులు, ద్వారంపూడి, అయోధ్యరామిరెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్‌, మల్లాది విష్ణు, తెల్లం బాలరాజు విడివిడిగా  ముఖ్యమంత్రిని కలిసి మంతనాలు జరిపారు.

అధిష్ఠానం నిర్ణయంపై కొంతమంది వైసీపీ నేతలు విధేయత ప్రకటిస్తుంటే.. మరికొంతమంది మాత్రం తమదారి తాము చూసుకుంటామని కుండలు బద్దలు కొట్టేస్తున్నారు. ఈమధ్య వైసీపీ అధిష్ఠానంపై ధిక్కార స్వరం వినిపించిన కాపు రామచంద్రారెడ్డి.. మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత రఘువీరారెడ్డిని కలిసి మాట్లాడారు. అయితే ఈ ఎన్నికలలో ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానని రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.

అలాగే మరోవైపు నిన్నంతా సోషల్ మీడియాను, ఏపీ పాలిటిక్స్‌ను తన సెన్సేషనల్ కామెంట్లతో ఓ రేంజ్‌తో  కాక పుట్టించిన  శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. జగన్‌ను కలిసి వచ్చాక సడెన్‌గా స్వరం మార్చేసారు. తాను సీఎం జగన్‌ను ఒక్క మాటా అనలేదనీ… కేవలం అధికారుల తీరుపైనే తాను మాట్లాడితే మీడియా వక్రీకరించిందని ప్లేటు ఫిరాయించారు. ఇటు ఎంపీలు గోరంట్ల మాధవ్‌, నందిగం సురేష్‌ అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యమని చెప్పుకొచ్చాు..

అటు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తును కూడా వైసీపీ  అధిష్టానం పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ముగ్గురు సభ్యులను అల్మోస్ట్ కన్ఫమ్ చేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఎంపిక చేసినవారిలో ఓసీ వర్గానికి చెందిన వైవీ సుబ్బారెడ్డితో పాటు..ఎస్సీ సామాజికవర్గానికి చెందిన గొల్ల బాబురావు అలాగే బలిజ వర్గానికి చెందిన జంగాలపల్లి శ్రీనివాస్‌ ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + eight =