జిల్లాల వారిగా కేండిడేట్స్ లిస్ట్

Is This The First List Of TDP Candidates, First List Of TDP Candidates, TDP Candidates First List, TDP Candidates, First List Of TDP Candidates, District Wise List Of Candidates,TDP, Candidates, Latest TDP Candidates News, TDP Candidates News Update, TDP, Chandrababu, Andhra Pradesh, Ap Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది. ఇప్పటికే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఏ  పార్టీ గట్టి పోటీ ఇస్తుందోనని చర్చలు షురూ అయిపోయారు. ఓ వైపు అసంతృప్తులు పెరిగిపోతున్నా వైసీపీలో అభ్యర్ధుల జాబితాను ప్రకటిస్తూనే ఉన్నారు సీఎం జగన్. మరోవైపు జనసేన, టీడీపీ కలిసినడుస్తూ.. జగన్‌ను ఎలా అయినా ఓడించాలని పట్టుదలతో పక్కా స్కెచ్‌తో ముందుకు వెళుతున్నారు. దీనిలో భాగంగానే సుమారు 60 మంది అభ్యర్థులతో..టీడీపీ తన తొలి జాబితా సిద్ధం చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

నిజానికి ఏపీలో రాజకీయం గరంగరంగా సాగుతోంది. వైనాట్ 175 అంటూ కాన్ఫిడెన్స్ పెంచుకున్న  సీఎం జగన్..అదే దూకుడుతో అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తూ వస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టి..కాస్త మొండిగానే ముందుకు వెళుతున్నారు. దీంతో రోజుకో నేత బయటకు  వస్తూ తమ అసంతృప్తిని  ప్రకటిస్తూ వైసీపీలో గుబులు రేపుతున్నారు. మరోవైపు టీడీపీ,జనసేన కలిసి సీట్ల సర్ధుబాటు నుంచి వచ్చే ఎన్నికలలో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు.

పొత్తులో భాగంగా సీట్ల సర్ధుబాటుకు.. గట్టిగా కసరత్తులు జరుపుతున్న చంద్రబాబు.. తొలి జాబితాపై ఒక కన్ క్లూజన్ కి వచ్చేసారన్న టాక్ నడుస్తోంది. జనసేనతో కలిసి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగితే ..ఆశాజనకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని బలంగా నమ్ముతున్న చంద్రబాబు… ఇప్పటికే  దాదాపు 60 మంది కేండిడేట్లతో.. తొలి జాబితా సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. సంక్రాంతికి  అభ్యర్ధుల  జాబితాను అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

విజయనగరం:

విజయనగరం – అశోక్‌ గజపతి రాజు

చీపురుపల్లి – కిమిడి నాగార్జున

కురుపాం – టి.జగదీశ్వరి

పార్వతీపురం – బి. విజయచంద్ర

విశాఖపట్నం:

విశాఖ తూర్పు – వెలగపూడి రామకృష్ణబాబు

విశాఖ పశ్చిమ – గణబాబు

పాయకరావుపేట – అనిత

నర్సీపట్నం – చింతకాయల అయ్యన్నపాత్రుడు

శ్రీకాకుళం:

ఇచ్ఛాపురం – బెందాళం అశోక్

టెక్కలి – అచ్చెన్నాయుడు

ఆమదాలవలస – కూన రవికుమార్‌

పలాస – గౌతు శిరీష

రాజాం – కొండ్రు మురళి

బొబ్బిలి – బేబీ నాయన

తూర్పుగోదావరి:

తుని – యనమల దివ్య

జగ్గంపేట – జ్యోతుల నెహ్రూ

పెద్దాపురం – నిమ్మకాయల చినరాజప్ప

అనపర్తి – నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

రాజమండ్రి సిటీ – ఆదిరెడ్డి వాసు

గోపాలపురం – మద్దిపాటి వెంకట్రాజు

మండపేట – వేగుళ్ల జోగేశ్వరరావు

ముమ్మడివరం – దాట్ల సుబ్బరాజు

అమలాపురం – అయితాబత్తుల ఆనందరావు

పి.గన్నవరం – గొల్లపల్లి సూర్యారావు

పశ్చిమ గోదావరి:

పాలకొల్లు – నిమ్మల రామానాయుడు,

ఉండి – మంతెన రామరాజు,

ఆచంట – పితాని సత్యనారాయణ

దెందులూరు – చింతమనేని ప్రభాకర్‌

కృష్ణా జిల్లా:

విజయవాడ తూర్పు – గద్దె రామ్మోహన్‌ రావు

విజయవాడ సెంట్రల్‌ – బోండా ఉమ

నందిగామ – తంగిరాల సౌమ్య

జగ్గయ్యపేట – శ్రీరాం

మచిలీపట్నం – కొల్లు రవీంద్ర

గన్నవరం – యార్లగడ్డ వెంకట్రావు

పెనమలూరు – బోడె ప్రసాద్‌

గుంటూరు జిల్లా:

మంగళగిరి – నారా లోకేష్‌

పొన్నూరు – ధూళిపాళ్ల నరేంద్ర

చిలకలూరిపేట – పత్తిపాటి పుల్లారావు

సత్తెనపల్లి – కన్నా లక్ష్మీ నారాయణ

వినుకొండ – జీవీ ఆంజనేయులు

గురజాల – యరపతినేని శ్రీనివాసరావు

మాచర్ల – జూలకంటి బ్రహ్మానందరెడ్డి

వేమూరు – నక్కా ఆనందబాబు

కర్నూలు జిల్లా:

బనగానపల్లి – బీసీ జనార్దన్‌ రెడ్డి

పాణ్యం – గౌరు చరిత

కర్నూలు – టీజీ భరత్‌

ఎమ్మిగనూరు – బి.వి జయనాగేశ్వర రెడ్డి

రాప్తాడు – పరిటాల సునీత

ఉరవకొండ – పయ్యావుల కేశవ్

తాడిపత్రి – జేసీ అస్మిత్‌ రెడ్డి

హిందూపూర్‌ – నందమూరి బాలకృష్ణ

కల్యాణదుర్గం – ఉమా మహేశ్వర నాయుడు

కదిరి – కందికుంట వెంకట ప్రసాద్‌

ప్రకాశం జిల్లా:

పర్చూరు – ఏలూరి సాంబశివరావు

ఒంగోలు – దామెచర్ల జనార్దన్

కొండెపి – బాల వీరాంజనేయ స్వామి

కనిగిరి – ఉగ్ర నరసింహా రెడ్డి

నెల్లూరు జిల్లా:

కోవూరు – పోలంరెడ్డి దినేష్‌ రెడ్డి

ఆత్మకూరు – ఆనం రామనారాయణ రెడ్డి

నెల్లూరు రూరల్‌ – కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి

చిత్తూరు జిల్లా:

కుప్పం – నారా చంద్రబాబు నాయుడు

శ్రీకాళహస్తి – బొజ్జల సుధీర్‌ రెడ్డి

నగిరి – గాలి భానుప్రకాష్

పలమనేరు – అమరనాథ్‌ రెడ్డి

పీలేరు – నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి

కడప జిల్లా:

జమ్మలమడుగు – భూపేష్‌ రెడ్డి

మైదుకూరు – పుట్టా సుధాకర్

పులివెందుల – బీటెక్‌ రవి

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =