ఇకపై వీసా లేకుండానే అమెరికాకి వెళ్లొచ్చు.. కానీ వారు మాత్రమే..

Now They Can Go To America Without A Visa But Only They,Visa Waiver Program,Travel Without A Visa,United States Without A Visa,Mango News,Mango News Telugu,U.S. Travel Visas,Esta And The Visa Waiver Program,Visa Waiver Program Requirements,Nonimmigrant And Tourist Visas,Apply For A U.S. Visa,U.S. Visas And Entry,America Without A Visa Latest News,America Without A Visa Latest News And Updates,America Without A Visa Updates

అగ్రరాజ్యం అమెరికా.. చాలా మందికి ఆ దేశం వెళ్లాలని డ్రీమ్ ఉంటుంది. జీవితంలో ఒక్కసారి అయినా అగ్రరాజ్యంలో అడుగుపెట్టాలని కలలు కంటుంటారు. చాలా మంది మాస్టర్స్ చదివేందుకు.. ఉద్యోగాల కోసం అమెరికా వెళ్తుంటారు. కానీ అందరికీ తెలిసిందే.. అమెరికా వెళ్లడం ఎంత కష్టం.. ఎంత ఖర్చుతో కూడుకున్నదో. అమెరికాలో ల్యాండ్ అయిన తర్వాత కూడా.. చిన్న చిన్న తప్పిదాల వల్ల ఎయిర్‌పోర్ట్ నుంచి తిరిగి వచ్చిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు.

అంతేకాకుండా అమెరికా వీసా దొరకడం కూడా చాలా కష్టంతో కూడుకున్నది. కొందరు ఏళ్ల తరబడి ఎదురు చూసినా కూడా వీసా దొరకని పరిస్థితి ఉంది. ప్రస్తుతం భారతీయులు అమెరికా వీసా కోసం 8 నెలల నుంచి సంవత్సరం వరకు వేచి చూడాల్సి వస్తోంది. అయితే ఇప్పుడు అమెరికా బంపర్ ఆఫర్ ప్రకటించింది. వీసా లేకుండానే అమెరికాలో అడుగుపెట్టే అవకాశం కల్పిస్తోంది. ఆఫర్ అదిరిపోయింది కదా. ఇక వీసా టెన్షన్ లేకుండానే అమెరికా ఫ్లైట్ ఎక్కేద్దాం అనుకుంటున్నారా..  అయితే వన్ సెకన్. ఈ ఆఫర్ అందరికి కాదు. కేవలం ఇజ్రాయిల్ వారికి మాత్రమే..

ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొద్దిరోజులుగా యుద్ధం జరుగోంది. రోజురోజుకు ఆ యుద్ధం భీకరంగా మారుతోంది. అటు హమాస్.. ఇటు ఇజ్రాయెల్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే భారత్, అమెరికాతో సహా పలు దేశాలు.. ఇజ్రాయెల్‌కు అండగా నిలిచాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఇజ్రాయెల్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటామని.. ఎటువంటి సాయం చేసేందుకు అయినా వెనుకాడమని స్పష్టం చేశారు. అలాగే 14 ఇజ్రాయెల్‌కు 14 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం కూడా ప్రకటించారు.

అంతేకాకుండా ఇజ్రాయెల్ పౌరులు ఎటువంటి వీసా లేకుండా అమెరికాలో పర్యటించేందుకు జో బైడెన్ వీలు కల్పించారు. వీసా లేకుండా 90 రోజుల పాటు అమెరికాలో పర్యటించేలా అవకాశం కల్పించారు. ఇక నుంచి బయోమెట్రిక్ పాస్ పోర్టులు ఉన్న ఇజ్రాయెల్ పౌరులు వీసా లేకుండానే అమెరికాలో పర్యటించవచ్చు.  ఇందుకోసం ఈ గురువారం నుంచే ఈ మినహాయింపు అమలులోకి వచ్చింది. మిత్రదేశాల వల్లే తాము సురక్షితంగా ఉన్నామని అన్న బైడెన్.. ఆ దేశాలకు కష్టమొస్తో అండగా ఉండేందుకు ఏ మాత్రం వెనుకాడమని అన్నారు. ఇజ్రాయెల్‌కు చేసే సాయం.. ఆ తర్వాత తమ భద్రతకు మూలమవుతుందని బైడెన్ చెప్పుకొచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 9 =