ట్విట్టర్ కు భారీ షాక్, మధ్యవర్తిత్వ హోదాను కోల్పోయిన ట్విట్టర్

Mango News, micro blogging social media platform lost, protective shield in India, Twitter India news, Twitter India vs government, Twitter loses ‘safe harbour’ shield in India, Twitter loses legal immunity in India, Twitter loses legal protection in India, Twitter Loses Legal Shield, Twitter loses legal shield in India, Twitter loses safe harbour immunity in Indi, Twitter Lost Protective IT Shield In India, Unable To Comply New IT Rules

దేశంలో మే 26 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఐటీ నిబంధనల విషయంలో ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ ట్విట్టర్ కు, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విట్టర్ కు మరో భారీ షాక్ తగిలింది. కొత్త ఐటీ నిబంధనలను అమలు చేయనందుకు గాను ట్విట్టర్ మధ్యవర్తిత్వ హోదాను కోల్పోయింది. నిబంధనలను పాటించడంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఇటీవలే ట్విట్టర్ సంస్థకు తుది నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ ట్విట్టర్ నుంచి స్పందన లేకపోవడంతో దేశంలో ట్విట్టర్ కు ఉన్న చట్టపరమైన రక్షణను కేంద్రం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. మధ్యవర్తి హోదా/చట్టపరమైన రక్షణ కోల్పోవడంతో వినియోగదారుల అభ్యంతరకర, చట్టవిరుద్ధ పోస్టులకు ఇకపై ట్విట్టర్ సంస్థ కూడా చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో ట్విటర్‌పై ఓ కేసు కూడా నమోదైంది. ఘజియాబాద్ లో మ‌త‌ప‌ర‌మైన హింస‌ను ప్రోత్సహించారంటూ, ట్విట్టర్, పలువురు జర్నలిస్టులపైనా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు

ఈ అంశంపై కేంద్ర న్యాయ, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. దేశంలో సురక్షితమైన సదుపాయాన్నీ పొందేందుకు ట్విట్టర్ కు అర్హత ఉందా అనే దానిపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు. అయితే మే 26 నుండి అమల్లోకి వచ్చిన మధ్యవర్తిత్వ మార్గదర్శకాలను పాటించడంలో ట్విట్టర్ విఫలమైందని చెప్పారు. ట్విట్టర్‌ కు నిబంధనలు పాటించేందుకు అనేక అవకాశాలు ఇవ్వబడ్డాయని, అయినప్పటికీ ఉద్దేశపూర్వకంగా నిబంధనలు పాటించవద్దనే మార్గాన్ని ట్విట్టర్ ఎంచుకుందన్నారు.

దేశంలో కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియాలో వచ్చిన అసత్య, అవాస్తవాలు చెందిన ఒక చిన్న వార్త కూడా ఇబ్బందులను కలిగిస్తుందని, ఈ నేపథ్యంలోనే మధ్యవర్తిత్వ మార్గదర్శకాలను తీసుకురావడం జరిగిందన్నారు. అయితే మధ్యవర్తిత్వ మార్గదర్శకాల విషయంలో ఉద్దేశపూర్వకంగా ధిక్కరించే మార్గాన్ని ట్విట్టర్ ఎంచుకోవడం ఆశ్చర్యకరమైన విషయమని అన్నారు. అమెరికాలో లేదా ఇతర విదేశీ దేశాలలో వ్యాపారం చేయడానికి వెళ్ళే ఫార్మా, ఐటి లేదా ఇతరులు భారతీయ కంపెనీలు స్థానిక చట్టాలను స్వచ్ఛందంగా అనుసరిస్తాయని, దుర్వినియోగం మరియు దుర్వినియోగానికి గురైనవారికి న్యాయం చేసునేందుకు రూపొందించిన భారతీయ చట్టాలను పాటించడంలో ట్విట్టర్ వంటి వేదికలు ఎందుకు విముఖత చూపుతున్నాయి? అని మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here