సైబర్ క్రైమ్‌లకు చెక్ పెట్టేలా పెన్‌డ్రైవ్‌ సెక్యూరిటీలో మార్పులు

Pendrive Security Changes to Check Cyber Crimes,Pendrive Security Changes,Security Changes to Check Cyber Crimes,Mango News,Mango News Telugu,Pendrive Security,Check Cyber Crimes,Cyber criminals are mailing,USB Flash Drive Malware,Secured USB Drives,fingerprint pendrive, Pendrive Security Changes,Cyber Crimes,pendrive, Lexar Pen Drives,Cyber Attacks You Should Be Aware of in 2024,Pendrive Security Latest News,Pendrive Security Latest Updates,Pendrive Security Live News
Secured USB Drives,fingerprint pendrive, Pendrive Security Changes,Cyber Crimes,pendrive, Lexar Pen Drives

కాలంతో పాటు టెక్నాలజీ పోటీ పడుతూ వేగంగా మారుతోంది. అంతేవేగంగా భద్రత కూడా గాల్లో దీపంలా మారిపోతుంది.మనమంతా చాలావరకూ మనకు అవసరమైన ముఖ్యమైన ఫైల్స్‌, ఫోటోలు, వీడియోలు వంటివి కంప్యూటర్‌ లేదా ఫోన్స్‌లో భద్రపరుస్తుంటాం. అయితే ఆఫీసులో ఇంపార్టెంట్ ఫైల్స్ అయితే పెన్ డ్రైవ్‌లో జాగ్రత్తగా భద్రపరుస్తుంటాం.

ముఖ్యమైన ఆఫీసు ఫైల్స్‌, బ్యాంక్‌ అకౌంట్‌కు సంబంధించిన వివరాలు, సేవింగ్స్ వివరాలు పెన్‌డ్రైవ్స్‌లో భద్రపరుస్తూ ఉంటారు. అయితే అనుకోని పరిస్థితుల్లో ఆ పెన్ డ్రైవ్‌ పోగొట్టుకున్నా లేదా వేరే వాళ్లు తెలీకుండా దొంగతనం చేసినా..మన వివరాలన్నీ వారి చేతిలో పడినట్లే అవుతుంది. సింపుల్‌గా కంప్యూటర్‌కు కనెక్ట్‌ చేసి వివరాలను రాబట్టి వాళ్లకు కావల్సిన విషయాలను తెలుసుకుంటారు. దీనివల్ల పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద లావాదేవీలు, కోడింగ్, పర్సనల్ మ్యాటర్స్ వంటివి వేరే వాళ్ల చేతిలోకి వెళ్లిపోతాయి. అయితే ఇలాంటి ఇబ్బందులకు ఇప్పుడు చెక్‌ పెట్టేలా ఫింగర్‌ ప్రింట్‌ పెన్‌డ్రైవ్స్‌ వచ్చేసాయి. ఈ ఫింగర్ ప్రింట్ పెన్ డ్రైవ్స్ లెక్సార్‌ కంపెనీ లాంచ్‌ చేసింది.

లెక్సార్‌ అనేది గ్లోబల్ ఫ్లాష్ మెమరీ సొల్యూషన్స్ ప్రొవైడర్‌గా ఇప్పటికే బాగా గుర్తింపు పొందింది. ఈ కంపెనీ లెక్సార్‌ జంప్‌ డ్రైవ్‌ ఎఫ్‌ 35 3.0 పేరుతో డేటా భద్రతను అందించడానికి ఫి0గర్ ప్రింట్ టెక్నాలజీతో కూడిన పెన్‌డ్రైవ్‌ను పరిచయం చేసింది. ఈ జంప్‌డ్రైవ్ ఎఫ్35.. ఫింగర్‌ప్రింట్ అథెంటికేషన్ ద్వారా తమ డేటాను రక్షించుకోవడానికి వీలు కల్పిస్తుంది. అలాగే పెన్‌డ్రైవ్‌ ఒక్కరి వేలు ముద్రే కాకుండా మల్టీపర్సస్‌గా వాడుకోవడానికి చాలామంది ఫింగర్ ప్రింట్స్‌ వాడి పెన్ డ్రైవ్‌ను వాడుకునేలా కంపెనీ తయారు చేసింది. ఈ పెన్‌డ్రైవ్‌ గరిష్టంగా 10 వేర్వేరు వేలిముద్రలను నిల్వ చేయగల సామర్ధ్యం కలదిగా దీనిని కంపెనీ తయారు చేసింది.

మరోవైపు కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ పెన్‌డ్రైవ్‌ను సెటప్ చేయడం చాలా ఈజీ అట. ఎందుకంటే దీనికి సాఫ్ట్‌వేర్ డ్రైవర్‌ల కోసం ఇన్‌స్టాలేషన్ అవసరం లేదు. వినియోగదారులు తమ వేలిముద్రలతో ప్రామాణీకరించేటప్పుడు సులభంగా డ్రైవ్‌ను ప్లగ్ ఇన్ చేయవచ్చు. అలాగే దీనికి ఫింగర్ ప్రింట్‌తో పాటు పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.లెక్సార్‌ జంప్‌ డ్రైవ్‌ యూఎస్‌బీ..గరిష్టంగా 300 ఎంబీపీఎస్‌ ట్రాన్స్‌ఫర్ వేగంతో పని చేస్తుంది.

ఒక సెకనులోపు అత్యంత వేగవంతమైన గుర్తింపుతో పాటు, సాఫ్ట్‌వేర్ డ్రైవర్లు అవసరం లేకుండా ఈజీగా పెన్ డ్రైవ్‌ను సెటప్ చేసుకోవచ్చు. అలాగే ఈ పెన్‌డ్రైవ్‌పై మూడేళ్ల వారెంటీను కూడా ఇస్తున్నారు. 32 జీబీ లెక్సార్‌ జంప్‌ డ్రైవ్‌ ధర రూ. 4,500గా ఉండగా… 64 జీబీ మోడల్‌కు రూ. 6,000గా దీని ధరను నిర్ణయించారు. ఈ పెన్‌డ్రైవ్‌లను ఆన్‌లైన్ , ఆఫ్‌లైన్ రిటైలర్‌ల నుంచి కొనుక్కోవచ్చు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =