ఉదయం కంటే సాయంత్రం వ్యాయామం చేస్తేనే మంచిదా?

Is it better to exercise in the evening than in the morning,Is it better to exercise in the evening,exercise in the evening than in the morning,Mango News,Mango News Telugu,Is it better to work out in the morning,The Best Time of Day to Exercise,When to Work Out,Morning vs Evening workouts,Best Time to Workout,best time to do exercises, better to exercise,evening, morning, Benefits of doing exercises,exercises,Better to exercise News Today
best time to do exercises, better to exercise,evening, morning, Benefits of doing exercises,exercises

చాలామంది ఫిట్నెస్ కోసం, ఆరోగ్యం కోసం ఎక్సర్‌సైజులు చేస్తూ ఉంటారు. అయితే వ్యాయామాలు ఉదయం పూట చేయాలా? లేక సాయంత్రం పూట చేయాలా? ఏ సమయంలో చేస్తే మంచిదనే డౌట్లు చాలా మందిలో వస్తుంటాయి. అయితే ఉదయం పూట ఎక్సర్‌సైజులు చేయడం మంచిదని కొందరు చెబుతుంటే. .మరికొందరు మాత్రం సాయంత్రం పూట చేయడం బెటర్ అంటున్నారు.

అయితే వ్యాయామాలు చేయడానికి రెండు సమయాలకే మంచివేనని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు. కాకపోతే తిన్నాక రెండు గంటలు దాటాకే వ్యాయామాలు చేయడం మంచిదని అంటున్నారు. ఖాళీ కడుపుతో చేసే ఎక్సర్‌సైజులు మంచి ఫలితాలను ఇస్తాయంటున్నారు. అలాగగే వ్యాయామాలు చేసిన వెంటనే బ్రేక్ ఫాస్ట్ , స్నాక్స్ వంటివి తినడం మంచిది కాదని.. అరగంట అయినా గ్యాప్ ఇచ్చాకే తినాలని చెబుతున్నారు. ఇలా చేసిన ఎక్సర్‌సైజులే ఎక్కువ ఫలితాలనిస్తాయట. అంతే తప్ప ఉదయం వ్యాయామం చేస్తున్నారా, సాయంత్రం చేస్తున్నారా అన్నది మ్యాటర్ కాదంటున్నారు. వారానికి 4,5 రోజులు అయినా వ్యాయామం చేయడం అందరికీ మంచిదని చెబుతున్నారు.

సాయంత్రం పూట ఎక్సర్‌సైజులు చేస్తే లాభాలు..

ఉదయం ఆఫీసులకు, వివిధ పనులతో బయటకు వెళ్లేవాళ్లకి టైమ్ సరిపోదన్నవాళ్లకి సాయంత్రమే బెస్ట్ సమయం. సాయంత్రం కూల్ గా వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి నుంచి రిలీఫ్ దొరుకుతుంది. వారి పనులు అయిపోవడంతో కేవలం వ్యాయామాలపైనే దృష్టి సారిస్తారు కాబట్టి ఎక్కువ ఫలితాలుంటాయి. పావుగంట, అరగంట అని హడావుడిగా కాకుండా మినిమం 45 నిమిషాలు అయినా ప్రశాంతంగా వ్యాయామాలు చేసుకునే అవకాశం ఉంటుంది.

ఉరుకులు పరుగులతో బిజీగా ఉన్న వారికి సాయంత్రం ఎక్సర్ సైజ్ చేయడం వల్ల ఆందోళన, నిరాశ, ఒత్తిడి వంటి నుంచి బయటపడొచ్చు. అలాగే మంచి నిద్ర కూడా పడుతుంది. దీనివల్ల కొన్ని అనారోగ్య సమస్యల నుంచి బయట పడొచ్చు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఏకాగ్రత కూడా పెరుగుతుంది.

సాయంత్రం ఎక్సర్ సైజ్ చేయడం ఆడవాళ్ల కంటే కూడా మగవారికి బాగా మేలు చేస్తుంది. సాయంత్రం హడావుడి లేకుండా వ్యాయామం చేస్తారు కాబట్టి.. ఫోకస్ అంతా దీనిపైనే ఉంటుంది. దీంతో కొవ్వును కరిగించుకోవడానికి మరింత సమయాన్ని గడపొచ్చు. దీని వల్ల బెల్లీ ఫ్యాట్, తొడ భాగాల్లో ఉన్న కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గాలనుకునే మగవాళ్లకు సాయంత్రమే బెస్ట్ అంటున్నారు నిపుణులు.

అయితే ఉదయం పూట వ్యాయామం చేస్తే ఆ రోజు అంతా హుషారుగానే ఉంటుంది. శరీరంలో ఉన్న అలసట ఉదయాన్నే పోతుందని.. ఆ రోజు యాక్టివ్‌గా ఉంటారని నిపుణులు అంటున్నారు. ఉదయం ఎక్సర్‌సైజులు చేయడం వల్ల కండరాలు గట్టిగా మారతాయి. అంతే కాకుండా బాడీ రిలాక్స్ గా ఉండటంతో పాటు తేలికగా ఉన్నట్లు అనుకుంటారు. కాస్త సమయం ఉన్నవాళ్లు మాత్రం ఉదయం పూట వ్యాయామాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =