కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌: ‘కంట్రీ ఆఫ్ హానర్’గా భారత్ పాల్గొనడంపట్ల సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ

PM Modi Expressed Happiness on India’s Participation as Country of Honour at Cannes Film Festival this Year, Modi Expressed Happiness on India’s Participation as Country of Honour at Cannes Film Festival this Year, India’s Participation as Country of Honour at Cannes Film Festival this Year, Cannes Film Festival, 75th Cannes Film Festival 2022, Cannes Film Festival 2022, 2022 Cannes Film Festival, 75th Cannes Film Festival News, 75th Cannes Film Festival Latest News, 75th Cannes Film Festival Latest Updates, 75th Cannes Film Festival Live Updates, PM Narendra Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Prime Minister Of India Narendra Modi, Mango News, Mango News Telugu,

ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ 75వ ఫిల్మ్ ఫెస్టివల్ లో భారతదేశం మొదటి ‘గౌరవ దేశం’గా ఎంపిక చేయబడింది. మొదటి రోజున కేంద్ర ప్రసార, సమాచార మంత్రి అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో భారత్ నుండి వెళ్లిన పలువురు సెలెబ్రిటీలు రెడ్ కార్పెట్‌పై నడిచారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారతదేశం ‘కంట్రీ ఆఫ్ హానర్’గా పాల్గొనడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు కావడం, ఇది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ యొక్క 75వ వార్షికోత్సవం కావడం, అలాగే భారత్ మరియు ఫ్రాన్స్ మధ్య దౌత్య సంబంధాలు 75 సంవత్సరాలకు చేరుకున్న ఈ సమయంలో జరుగుతున్న కేన్స్ వేడుకల్లో భారత్ పాల్గొంటుందని ప్రధాని మోదీ ఒక సందేశంలో పేర్కొన్నారు.

ప్రపంచంలోనే అత్యధిక చలనచిత్రాలను నిర్మిస్తున్న దేశంగా భారత్ నిలిచిందన్నారు. దేశ చలనచిత్ర రంగం యొక్క బహుముఖత్వం విశేషమైనదని, సుసంపన్నమైన వారసత్వం మరియు సాంస్కృతిక వైవిధ్యం మన బలాలని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో చెప్పడానికి చాలా కథలు ఉన్నాయని, ప్రపంచం యొక్క కంటెంట్ హబ్‌గా మారడానికి దేశం నిజంగా అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని ప్రధాని పేర్కొన్నారు. చలనచిత్ర రంగంలో వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి దేశం యొక్క నిబద్ధతను ప్రధాని పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ ఫిల్మ్-కోప్రొడక్షన్‌ను సులభతరం చేయడం నుండి, దేశవ్యాప్తంగా చిత్రీకరణకు అనుమతుల కోసం సింగిల్ విండో క్లియరెన్స్ మెకానిజంను అందించడం ద్వారా, భారతదేశం ప్రపంచ చిత్రనిర్మాతలకు ఎలాంటి ఇబ్బందులు లేని అవకాశాలను కల్పిస్తుందని చెప్పారు.

దేశం సినీ మాస్ట్రో సత్యజిత్ రే శతజయంతి ఉత్సవాలను జరుపుకుంటున్న సందర్భంగా కేన్స్ క్లాసిక్ విభాగంలో సత్యజిత్ రే చిత్రాన్ని ప్రదర్శించేందుకు పునరుద్ధరించడం పట్ల ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. భారతదేశానికి చెందిన స్టార్టప్‌లు సినీ ప్రపంచానికి తమ బలాన్ని ప్రదర్శిస్తాయని, ఇండియా పెవిలియన్ భారతీయ సినిమా కోణాలను ప్రదర్శిస్తుందని మరియు అంతర్జాతీయ భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 8 =