ఆస్ట్రేలియా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. సిడ్నీలో ప్రవాస భారతీయుల ఘన స్వాగతం

PM Modi Arrives in Australias Sydney For Bilateral Talks After Concluding Papua New Guinea Visit,PM Modi Arrives in Australias Sydney,PM Modi in Australia For Bilateral Talks,PM Modi After Concluding Papua New Guinea Visit,Papua New Guinea Visit,PM Modi Bilateral Talks,Mango News,Mango News Telugu,PM Modi in Australia,PM Modi Live Updates,PM Modi in Sydney Live Updates,PM Modi leaves for Australia,PM Modi arrives in Sydney,PM Modi kickstarts Sydney visit,Indias PM arrives in Sydney,PM Modi in Papua New Guinea Live Updates,Narendra modi Latest News and Updates,Latest Indian Political News

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా చివరిదైన ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీ చేరుకున్న ఆయనకు ఆస్ట్రేలియా అధికార ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అలాగే విమానాశ్రయం వద్ద ప్రధాని మోదీకి ప్రవాస భారతీయుల నుంచి ఘన స్వాగతం లభించింది. కాగా అక్కడ 22-24 తేదీల మధ్య ప్రధాని మోదీ పర్యటించనుండగా.. ఈ రోజు అంటే మంగళవారం ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయులతో ఆయన భేటీ కానున్నారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసగించనున్నారు. కాగా ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ 2016 జనాభా లెక్కల ప్రకారం, ఆస్ట్రేలియాలో మొత్తం 6,19,164 మంది భారత్‌కి చెందినవారు ఉన్నారు. కాగా ప్రధాని మోదీ చివరిసారిగా 2014లో ఆస్ట్రేలియాలో పర్యటించారు.

ఇక ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్‌తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్నందున రక్షణ, వాణిజ్యం, పునరుత్పాదక ఇంధనం మరియు వ్యాపారంపై రాబోయే రెండు రోజుల్లో చర్చలు జరపనున్నారు. ఈ క్రమంలో నేటిరాత్రి సిడ్నీ ఒలింపిక్ పార్క్‌లో జరిగే కమ్యూనిటీ ఈవెంట్‌కు మోదీ మరియు అల్బనీస్ కూడా హాజరవుతారు. ఇక ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీకి చెందిన 20,000 మందికి పైగా సభ్యులు హాజరయ్యే అవకాశం ఉంది. కాగా అమెరికా జాతీయ రుణ సమస్యలపై దృష్టి సారించేందుకు ఆ దేశాధ్యక్షుడు జో బిడెన్ గైర్హాజరుతో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ మరియు భారతదేశానికి చెందిన నాయకులతో ఈ వారం సిడ్నీలో జరగాల్సిన క్వాడ్ సమావేశం రద్దు చేయబడిన విషయం తెలిసిందే. దీనికి బదులుగా క్వాడ్ నాయకులు వారాంతంలో జపాన్‌లో జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ జీ7 సమావేశాలలో పాల్గొన్న అనంతరం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లడం గమనార్హం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =