సీఎంలతో ముగిసిన ప్రధాని మోదీ వర్చువల్ భేటీ

PM Modi Held Video Conference With CMs on COVID-19 Situation, PM Modi, Modi to chair meet with CMs of all states on Covid-19 Situation, CMs of all states, PM Modi Held Video Conference With CMs of all states, PM Narendra Modi interacts with all states CMs, PM Narendra Modi, Prime Minister Narendra Modi, Coronavirus, coronavirus India, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant,

భారత్ లో కోవిడ్ డేంజర్ బెల్స్ మోగిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక సమావేశం నిర్వహించారు. కరోనా పరిస్థితులపై చర్చించేందుకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని ఇవాళ వర్చువల్‌గా భేటీ అయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు. కేవలం 10 రోజుల్లో 3 కోట్ల మంది టీనేజర్లకు వ్యాక్సిన్ వేశామని తెలిపారు. ఇప్పటివరకు దేశంలో 70% మందికి రెండో డోసు వాక్సినేషన్ పూర్తయిందని తెలియజేసారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసులు భారీగా పెరుగుతుండటం.. ఒమిక్రాన్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఫ్రంట్ లైన్ వర్కర్లకు మరియు వృద్దులకు ప్రికాషన్ డోస్ ఇస్తున్నామని తెలిపారు మోదీ.

రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రముఖంగా చర్చించారు ప్రధాని మోదీ. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో కోవిడ్-19 ఆంక్షలు కొనసాగుతున్నాయి. వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్దతుల గురించి అడిగి తెలుసుకున్నారు ప్రధాని. అలాగే, కేసులు తక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని మోదీ సూచించారు. రాష్ట్రాల వద్ద అధిక మొత్తంలో టీకాలు నిల్వచేసుకుని ఉంచుకోవాలని ముఖ్యమంత్రులకు సూచించారు మోదీ. అలాగే ప్రస్తుత తరుణంలో దెశ ఆర్ధిక పరిస్థితిపైనా ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చించారు. ఒమిక్రాన్ గురించి కూడా ప్రధానంగా చర్చించారు మోదీ. ప్రస్తుతం దేశంలో రోజువారీ కేసుల సంఖ్య 2 లక్షలు దాటడం గమనార్హం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =