ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా: బీజేపీ సీనియర్‌ నేత మురళీధర్‌ రావు

BJP Senior Leader Muralidhar Rao Announces will Contest in Elections, BJP Senior Leader Muralidhar Rao, BJP Senior Leader Muralidhar Rao will Contest in Elections, BJP Senior Leader, BJP, BJP Party, BJP Party Latest News, BJP Party Latest Updates, Muralidhar Rao will Contest in 2022 Elections, Mango News, Mango News Telugu,

బీజేపీ సీనియర్‌ జాతీయ నేత బి. మురళీధర్‌ రావు ఈసారి తాను ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్టు వెల్లడించారు. అయితే, అసెంబ్లీ లేదా పార్లమెంట్ ల‌లో దేనినుంచి పోటీ చేయాలనే అంశాన్ని పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని మురళీధర్‌ రావు అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మురళీధర్‌ రావు మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ బలంగా ఉందని, టీఆర్‌ఎ్‌స్ కు ప్రత్యామ్నాయం బీజేపీ యేనని స్పష్టం చేశారు.

కాగా, పంజాబ్‌లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా జరిగిన భద్రతవైఫల్యం ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిందని ఆయన అన్నారు. దాని వెనుక రాజకీయ కోణం ఉందని బీజేపీ జాతీయ నేత మరళీధర్‌రావు అన్నారు. ప్రధాని పర్యటనకు వస్తే పంజాబ్‌ సీఎం, డీజీపీ, సీస్ ఎందుకు స్వాగతం పలకలేదని ప్రశ్నించారు. ప్రధాని సెక్యూరిటీపై పంజాబ్‌ సీఎం, కాంగ్రెస్‌ నాయకత్వం రాజకీయం చేయడం తగదన్నారు. కాంగ్రెస్‌లో జరుగుతున్న గొడవలు ఎవరు పరిష్కరించాలో ఆ పార్టీ నాయకులకే తెలియకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని, బాధితులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 9 =