ప్రధాని నరేంద్ర మోదీతో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ భేటీ

PM Modi Met Google CEO Sundar Pichai and Discussed about Innovation Technology,Prime Minister Modi, Prime Minister Modi Google CEO Meet,Google CEO Sundar Pichai,Prime Minister Modi Meet Sundar Pichai, Prime Minister Modi Latest News and Updates,Mango News,Mango News Telugu,Prime Minister Modi News and Live Updates,Indian Prime Minister Modi,Modi Latest News And Updates,Sundar Pichai Latest News and Updates,Sundar Pichai News and Live Updates,Sundar Pichai Met Draupadi Murmu,Google Ceo India Visit

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీతో సోమవారం గూగుల్, ఆల్ఫాబెట్ సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) సుందర్ పిచాయ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇన్నోవేష‌న్, సాంకేతికత సహా మ‌రికొన్ని అంశాల‌తో చ‌ర్చించారు. ముందుగా ప్రధానితో భేటీపై సుందర్ పిచాయ్ ట్వీట్ చేస్తూ, “ఈరోజు జరిగిన గొప్ప సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. మీ నాయకత్వంలో సాంకేతిక మార్పుల వేగవంతమైన కావడాన్ని చూడటం స్ఫూర్తిదాయకం. మన బలమైన భాగస్వామ్యాన్ని కొనసాగించడానికి మరియు అందరికీ పని చేసే ఓపెన్, కనెక్ట్ చేయబడిన ఇంటర్నెట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి భారతదేశం యొక్క జీ-20 ప్రెసిడెన్సీకి మద్దతు ఇవ్వాలని ఎదురుచూస్తున్నాము” అని పేర్కొన్నారు.

అనంతరం ప్రధాని మోదీ స్పందిస్తూ, “సుందర్ పిచాయ్ మిమ్మల్ని కలవడం మరియు ఆవిష్కరణలు, సాంకేతికత మరియు మరిన్నింటి గురించి చర్చించడం చాలా ఆనందంగా ఉంది. మానవ శ్రేయస్సు, స్థిరమైన అభివృద్ధి కోసం సాంకేతికతను ప్రభావితం చేయడానికి ప్రపంచం కలిసి పనిచేయడం చాలా ముఖ్యం” అని పేర్కొన్నారు. మరోవైపు సోమవారం న్యూఢిల్లీలో జరిగిన గూగుల్ ఫర్ ఇండియా-2022 సమావేశంలో సుందర్ పిచాయ్, కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్, తదితరులు పాల్గొన్న విషయం తెలిసిందే.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 6 =