భారతదేశం ఎప్పుడూ ఏ దేశానికి లేదా సమాజానికి ముప్పు కలిగించలేదు: ప్రధాని మోదీ

PM Modi Participates in Celebrations of 400th Parkash Purab of Sri Guru Tegh Bahadur Ji at Red Fort, Celebrations of 400th Parkash Purab of Sri Guru Tegh Bahadur Ji at Red Fort, PM Modi Participates in Celebrations of 400th Parkash Purab, Celebrations of 400th Parkash Purab, Sri Guru Tegh Bahadur Ji, Sri Guru Tegh Bahadur Ji 400th Parkash Purab Celebrations at Red Fort, 400th Parkash Purab Celebrations at Red Fort, Parkash Purab Celebrations at Red Fort, Parkash Purab Celebrations, Red Fort, PM Modi Participates in Parkash Purab Celebrations at Red Fort, Parkash Purab Celebrations News, Parkash Purab Celebrations Latest News, Parkash Purab Celebrations Latest Updates, Parkash Purab Celebrations Live Updates, PM Modi, Narendra Modi, Prime Minister of India, Narendra Modi Prime Minister of India, PM Narendra Modi, Prime Minister Narendra Modi, Mango News, Mango News Telugu,

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన శ్రీ గురు తేగ్ బహదూర్ జీ 400వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రధాని శ్రీ గురు తేగ్ బ‌హ‌దూర్ జీకి ప్రార్థ‌న‌లు చేశారు, అలాగే సిక్కు ప్రతినిధులు ప్రధాని మోదీని సత్కరించారు. ఈ సందర్భంగా స్మారక నాణెం మరియు పోస్టల్ స్టాంపును కూడా ప్రధాని మోదీ విడుదల చేశారు. అనంతరం ఎర్రకోట నుంచి ప్ర‌ధాని మోదీ ప్రసంగిస్తూ, గురువుల అనుగ్రహంతోనే దేశం పూజ్య‌మైన గురువుల‌ బోధనల‌కు అనుగుణంగా ముందుకు సాగుతుంద‌ని అన్నారు.

గురు తేగ్ బహదూర్ జీ అమరవీరునికి సాక్షిగా నిలిచిన ఎర్రకోట, దేశ చరిత్ర మరియు ఆకాంక్షకు ప్రతిబింబంగా నిలిచినందున దాని చారిత్రక ప్రాముఖ్యతను ప్రధాని నొక్కిచెప్పారు. వందల సంవత్సరాల బానిసత్వం నుండి దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు మరియు దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కూడా ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ప్రయాణం నుండి వేరు చేయబడలేదని అన్నారు. అందుకే దేశం శ్రీ గురు తేజ్ బహదూర్ జీ 400వ జయంతి ఉత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను ఒకే విధమైన సంకల్పంతో జరుపుకుంటుందని చెప్పారు. మన గురువులు ఎల్లప్పుడూ జ్ఞానం, ఆధ్యాత్మికతతో పాటు సమాజం మరియు సంస్కృతి యొక్క బాధ్యతను తీసుకుంటారు. వారు బలాన్ని సేవా మాధ్యమంగా మార్చుకున్నారు అని ప్రధాని పేర్కొన్నారు.

భార‌త‌దేశం కేవలం ఒక దేశం మాత్రమే కాదని, ఇది మ‌న గొప్ప వారసత్వం మరియు గొప్ప సంప్రదాయమని అన్నారు. ఇది మన ఋషులు, గురువులచే వందల వేల సంవత్సరాల తపస్సుతో, దాని ఆలోచనలను సుసంపన్నం చేయడం ద్వారా పోషించబడిందని చెప్పారు. గురు తేగ్ బహదూర్ జీ అమర త్యాగానికి ప్రతీకగా ఉన్న గురుద్వారా షీష్‌గంజ్ సాహిబ్, గురు తేగ్ బహదూర్ త్యాగం యొక్క గొప్పతనాన్ని మనకు గుర్తు చేస్తుందని అన్నారు. ఆ కాలంలో మతం పేరుతో హింసకు పాల్పడిన వారి మతోన్మాదాన్ని, తీవ్ర దురాగతాలను ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో భారతదేశం తన గుర్తింపును కాపాడుకోవాలనే గొప్ప ఆశ గురు తేజ్ బహదూర్ జీ రూపంలో ఉద్భవించింది. ఔరంగజేబు నిరంకుశ ఆలోచనా విధానాలకు గురు తేజ్ బహదూర్ జీ శిలలా అడ్డు నిలిచారని ప్రధాని అన్నారు.

భారతదేశం ఎప్పుడూ ఏ దేశానికి లేదా సమాజానికి ముప్పు కలిగించలేదు: ప్రధాని మోదీ

ఇక భారతదేశం యొక్క తాత్విక సారాంశం గురించి ప్ర‌ధాని మోదీ ప్ర‌స్తావిస్తూ, “భారతదేశం ఎప్పుడూ ఏ దేశానికి లేదా సమాజానికి ముప్పు కలిగించలేదు. నేటికీ మనం సర్వలోక కళ్యాణం కోసమే ఆలోచిస్తాం. మనం స్వావలంబన భారతదేశం గురించి మాట్లాడేటప్పుడు, మొత్తం ప్రపంచ పురోగతిని ముందంజలో ఉంచుతాము. నేటి భారతదేశం ప్రపంచ వివాదాల మధ్య కూడా పూర్తి స్థిరత్వంతో శాంతి కోసం ప్రయత్నిస్తుంది మరియు దేశ రక్షణ మరియు భద్రత కోసం భారతదేశం సమానంగా దృఢంగా ఉంది. గురువులు అందించిన గొప్ప సిక్కు సంప్రదాయం మన ముందు ఉంది” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − six =