కోవిడ్ బాధిత అనాథ పిల్లల కోసం, ‘పీఎం కేర్స్‌ ఫర్‌ చిల్ట్రన్‌’ పథకం కింద నిధులను విడుదల చేసిన ప్రధాని మోదీ

PM Modi Releases Benefits Under PM CARES Scheme For Children Who Lost Parents Due To Covid-19, Children Who Lost Parents Due To Covid-19, PM Modi Releases Benefits Under PM CARES Scheme For Children, Modi Releases Benefits Under PM CARES Scheme For Children, PM CARES Scheme For Children, PM CARES Scheme For Children Who Lost Parents Due To Covid-19, PM Narendra Modi Releases Benefits Under PM CARES Scheme For Children Who Lost Parents Due To Covid-19, PM CARES Scheme, Covid-19, Benefits Under PM CARES Scheme For Children, Children, PM Narendra Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Prime Minister Of India Narendra Modi, Mango News, Mango News Telugu,

కోవిడ్-19 కారణంగా దేశంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు, పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్‌ ద్వారా మద్దతు ఇస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లల కోసం ‘పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్‌’ను మే 29, 2021న ప్రారంభించిన విషయం తెలిసిందే. చట్టపరమైన సంరక్షకులను లేదా దత్తత తీసుకున్న తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు కూడా దీనిని వర్తింపజేయనుంది. ఈ క్రమంలో.. సోమవారం పథక ప్రయోజనాలను ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విడుదల చేశారు.

ఈ పథకం కింద పాఠశాలలకు వెళ్లే అనాథ పిల్లలకు స్కాలర్‌షిప్‌లను బదిలీ చేశారు. అలాగే పీఎం కేర్స్ పాస్‌బుక్, ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద హెల్త్ కార్డ్‌ని అందించనున్నారు. ఈ పథకం ద్వారా పిల్లలకు ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ కూడా ఇస్తున్నారు. దీని నుండి ₹5 లక్షల వరకు ఉచిత చికిత్స సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. ఇంకా ఇతర రోజువారీ అవసరాల కోసం ఇతర పథకాల ద్వారా వారికి ప్రతి నెలా రూ. 4,000 అందించనుంది ప్రభుత్వం. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ పథకం ద్వారా పిల్లలకు 23 సంవత్సరాల వయస్సులో రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ పథకం పొందడానికి కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించింది. పిల్లల నమోదు కోసం ప్రభుత్వం సింగిల్-విండో సిస్టమ్ విధానంలో ఈ ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించింది.

ఈ ఆన్‌లైన్ పోర్టల్‌లో కొవిడ్ బాధిత అనాథ పిల్లలు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో మోదీ మాట్లాడుతూ.. “కోవిడ్ -19 మహమ్మారి సమయంలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వ్యక్తుల పరిస్థితి ఎంత కష్టమో నాకు తెలుసు. మహమ్మారి సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం ఈ కార్యక్రమం. పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ అటువంటి పిల్లల కోసం చేసిన ప్రయత్నమే ఇది. పిల్లలు తమ పాఠశాల విద్యను పూర్తి చేసినప్పుడు, భవిష్యత్తు విద్య లేదా ఉపాధి కోసం మరింత డబ్బు అవసరమవుతుంది. ఎవరైనా భవిష్యత్తులో వృత్తిపరమైన కోర్సులు, ఉన్నత విద్య కోసం ఎడ్యుకేషన్ లోన్ కావాలంటే పీఎం-కేర్స్ సహాయం చేస్తుంది’’ అని అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =