టెంపరరీ సెక్సువల్ పార్టనర్స్ కోసం వెతుకుంటున్న యూత్

Online Relationships,Youth looking for temporary sexual partners, temporary sexual partners, Dating Apps, Social Media, Dating Site

ఒకప్పుడు మనసు, మనసు కలిస్తేనే ప్రేమ పుడుతుందని..తరచూ మాట్లాడుకోవడం, కలుసుకోవడం, ఎక్కువ కాలం దానిని కాపాడుకోవడంతోనే ప్రేమ , రిలేషన్‌షిప్ బాగుంటుందని అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు అన్నీ మారినట్లే మనిషి ఆలోచనలు మారాయి. వస్తువులు మార్చినట్లు, వస్తువులను వాడుకుంటున్నట్లు మనిషిని వాడుకోవడాన్ని ట్రెండ్ గా మార్చుకుంటున్నారు. ఇది భారత దేశంలోనే కాదు.. ప్రపంప వ్యాప్తంగా ఇదే మైండ్ సెట్ తో ఉంటున్నారని ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనంలో వెల్లడయింది.

అప్పటి వరకూ ఎటువంటి పరిచయం లేని వ్యక్తితో కూడా క్షణాల్లోనే బంధాన్ని ఏర్పరుచుకోవడానికి ఇప్పటి తరం రెడీ అయిపోతోంది. సోషల్ మీడియా వేదికలు, డేటింగ్ యాప్‌లు వీరికి మరింత స్వేచ్ఛను అందించి కోరుకున్న భాగస్వామని ఎంచుకోవడంలో సహాయపడుతున్నాయి. ఇప్పటి జనరేషన్ తమ పార్టనర్‌ను సెలెక్ట్ చేసుకోవడానికి, మ్యారేజ్ చేసుకోవడానికి, టెంపరరీ రిలేషన్‌షిప్ కొనసాగించడానికి.. ఈ సైట్స్, యాప్స్ పైనే ఎక్కువగా ఆధారపడుతున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.

ఇలా తమకు నచ్చిన పార్టనర్‌ని ఎంచుకోవడానికి.. ప్రతీ పది మందిలో ముగ్గురు డేటింగ్ సైట్స్ లేదా డేటింగ్ యాప్‌ని వాడుతున్నట్లు ప్యూ రీసెర్చ్ సెంటర్ స్టడీ రిపోర్టులో చెప్పింది. ముఖ్యంగా 35 ఏళ్ల వయస్సు గల వారిలో.. సగం కంటే ఎక్కువ మందే ఈ డేట్స్ యాప్స్ ద్వారా టెంపరరీ పార్టనర్స్‌ను ఎంచుకుంటున్నట్లు తేలింది. గతేడాది యూఎస్ అడల్ట్స్‌లో 15 శాతం మంది డేటింగ్ సైట్ లేదా యాప్‌ సాయంతో పార్టనర్‌ను ఎంచుకున్నట్లు అధ్యయనం తెలిపింది. అంతేకాదు లవ్, డేటింగ్, ఎమోషనల్ వంటి ఎన్నో వ్యక్తిగత అంశాలను యూత్ ఆన్‌లైన్ వేదికగానే చర్చిస్తున్నట్లు గుర్తించింది.

కేవలం పెళ్లి కాని వారే ఈ డేటింగ్ యాప్స్ కోసం వెతుకుతున్నారా అంటే.. కాదని తమ లైఫ్ పార్టనర్‌ను కలిగి ఉండి కూడా.. ప్రతీ 10 మందిలో ఒకరు కేవలం ఎక్స్‌ట్రా సెక్సువల్ రిలేషన్ కోసం.. ఆన్ లైన్ డేటింగ్ సైట్ లేదా యాప్‌ల సాయంతో ఇతర వ్యక్తులను కలుసుకుంటున్నారట. ఆ తర్వాత 30 ఏళ్ల లోపు యువతీ యువకుల్లో ఆన్ లైన్ యాప్స్ ద్వారా పార్టనర్‌ను వెతుక్కుంటున్నట్లు తేలింది. అలాగే 44 శాతం మంది తాము జీవితాంతం కలిసుండే లైఫ్ పార్టనర్‌ను ఈ సోషల్ మీడియా వేదిక ద్వారా ఎన్నుకున్నారట. 40 శాతం మంది అయితే సాధారణంగా ఇద్దరి ఇష్టపూర్వకంగా డేటింగ్ చేయాలని అనుకుంటున్నట్టు.. ఓన్లీ సెక్స్ రిలేషన్ కోసం 24 శాతం మంది ఆన్ లైన్‌లో పార్టనర్స్‌ను వెతుకుతున్నారు. అయితే 22 శాతం మంది మాత్రం లోన్లీనెస్‌తో కొత్త స్నేహితుల కోసం వెతుకుతున్నట్లు స్టడీ తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 19 =