జైపూర్‌లో బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్ల సమావేశం.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ప్రధాని మోదీ, శ్రేణులకు దిశానిర్దేశం

PM Modi Sets The Goals For Next 25 years in BJP's National Office Bearers Meet at Jaipur, Modi Sets The Goals For Next 25 years, BJP's National Office Bearers Meet at Jaipur, BJP's National Office Bearers Meet, Prime Minister Narendra Modi Sets The Goals For Next 25 years in BJP's National Office Bearers Meet at Jaipur, Jaipur meet, BJP workers meet, Fix goals for next 25 years Says PM Modi, Prime Minister Narendra Modi advised Bharatiya Janata Party workers to fix goals for the next 25 years, Bharatiya Janata Party workers to fix goals for the next 25 years, Bharatiya Janata Party workers, BJP workers meet News, BJP workers meet Latest News, BJP workers meet Latest Updates, BJP workers meet Live Updates, PM Modi, PM Narendra Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Prime Minister Of India Narendra Modi, Mango News, Mango News Telugu,

దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేయడంతోపాటు ఈ ప్రయాణంలో ఎదురయ్యే అన్ని రకాల సవాళ్లను అధిగమించాలని ప్రధానమంత్రి నరేంద్ర పేర్కొన్నారు. శుక్రవారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. రాబోయే 25 ఏళ్లకు బీజేపీ లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. బీజేపీ పాలనలో ప్రభత్వాలపై ప్రజలకు విశ్వాసం ఏర్పడిందని, వారి అభివృద్ధికి ప్రభుత్వాలు పాటు పడతాయని నిజంగా నమ్ముతున్నారని అన్నారు. ఈ నెలలో కేంద్రంలో బిజెపి ఎనిమిదేళ్ల పాలనను పూర్తి చేసుకోనుందని గుర్తు చేశారు.

ఈ ఎనిమిదేళ్లు ఎన్నో గొప్ప సంకల్పాలు వాటికి సంబంధించిన విజయాలు సాకారమయ్యాయని పేర్కొన్నారు. ఈ కాలంలో సేవ, సుపరిపాలన మరియు పేదల సంక్షేమానికి మన ప్రభుత్వం అంకితమైందని మోదీ అన్నారు. ప్రస్తుతం భారతదేశంలోని ప్రతి పౌరుడు అభివృద్ధి ఫలితాలను చూడటంతోపాటు పనిని పూర్తి చేయాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాల బాధ్యత మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాల బాధ్యత మరింత పెరుగుతోంది. కానీ దీనిని అడ్డుకోవడానికి ప్రతిపక్ష పార్టీలు విషప్రచారం చేస్తాయని, వాటి పట్ల పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శుల నుంచి అన్ని రాష్ట్రాలపై సవివర నివేదిక తీసుకుని పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here