పోలీసు ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితి మరో 2 ఏళ్లు పెంపు, సీఎం కేసీఆర్ నిర్ణయం

CM KCR Decided to Increase the Upper Age Limit for 2 Years in Police Dept Posts Recruitment, KCR Decided to Increase the Upper Age Limit for 2 Years in Police Dept Posts Recruitment, Telangana CM KCR Decided to Increase the Upper Age Limit for 2 Years in Police Dept Posts Recruitment, Increase the Upper Age Limit for 2 Years in Police Dept Posts Recruitment, Police Dept Posts Recruitment, 2 Years in Police Dept Posts Recruitment, Police Dept Posts Recruitment Age Limit Extended, Police Dept Posts Recruitment Age Limit Has Been Extended for 2 Years, Police Dept Posts Recruitment News, Police Dept Posts Recruitment Latest News, Police Dept Posts Recruitment Latest Updates, Police Dept Posts Recruitment Live Updates, Upper Age Limit, CM KCR, KCR, Telangana CM KCR, K Chandrashekar Rao, Chief minister of Telangana, K Chandrashekar Rao Chief minister of Telangana, Telangana Chief minister, Telangana Chief minister K Chandrashekar Rao, Mango News, Mango News Telugu,

పోలీసు శాఖ ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండు సంవత్సరాలు పొడిగిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా రెండేండ్ల అనిశ్చితి ఏర్పడడం, తెలంగాణలో తొలిసారి 95 శాతం స్థానికత అమలులోకి రావడం దృష్ట్యా తెలంగాణ యువతీ, యువకులకు వయోపరిమితిని పెంచాలని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను, డీజీపీ ఎం.మహేంద్రరెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మరోవైపు పోలీస్ ఉద్యోగాల భర్తీలో అభ్యర్థుల వయోపరిమితిని ప్రభుత్వం ఇప్పటికే మూడేళ్లు పెంచిన సంగతి తెలిసిందే.

ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల 16,614 పోలీసు ఉద్యోగాల‌కు (ఎస్ఐ, కానిస్టేబుల్), ఎక్సైజ్, ర‌వాణా శాఖ‌ల్లో 677 కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు కలిపి మొత్తం మొత్తం 17,291 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్బీ) నోటిఫికేషన్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు www.tslprb.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన ప్రొఫార్మాలో మే 2వ తేదీ నుండి దరఖాస్తు స్వీకరణ ప్రారంభం కాగా, ఈ గడువు నేటితో (మే 20, శుక్రవారం) ముగియనుంది. అయితే తాజాగా అభ్యర్థుల వ‌యోప‌రిమితి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేప‌థ్యంలో ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు తుది గ‌డువును మే 26వ తేదీ రాత్రి 10 గంటల వరకు పొడిగిస్తునట్టు టీఎస్‌ఎల్‌పీఆర్బీ ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − four =