భార‌త్ యూపీఐ-సింగ‌పూర్ పేనౌ మధ్య అనుసంధాన ప్రక్రియ, ఇకపై నగదు బదిలీ మరింత సులభం

PM Modi Singapore PM Lee Hsien Loong Participates in Virtual Launch of Linkage Between UPI of India and PayNow of Singapore,PM Modi,PM Modi And Singapore PM, PM Modi Online Payment Connectivity,Mango News,Mango News Telugu,Online Payment Connectivity Between 2 Nations, Online Payment Between 2 Nations, Singapore PM Launch Online Payment, 2 Nations Launch Online Payment,Mango News,Pm Modi Singapore,India Singapore Payment Link,Online Payment Apps,Online Payment Platforms In India,Online Payment System In India,Payment Banks In India,Paynow App,Paynow Singapore,Singapore Payment,Singapore Payment Systems,Singapore Pm Comment On India,Singapore Pm Office,Singapore Pm On Modi,Singapore Pm Speech On India, PM Modi And Singapore PM Connectivity

భారతదేశానికి చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) మరియు సింగపూర్‌ కి చెందిన పేనౌ మధ్య రియల్ టైమ్ పేమెంట్ లింకేజ్ యొక్క వర్చువల్ లాంచ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు సింగపూర్ ప్రధాన మంత్రి లీహ్సీన్ లూంగ్ పాల్గొన్నారు. దీంతో ఇకపై భార‌త్‌, సింగ‌పూర్ దేశాల మ‌ధ్య న‌గదు లావాదేవీలు మ‌రింత సుల‌భ‌త‌రం కానున్నాయి. ఈ సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ మరియు సింగపూర్ మానిటరీ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవి మీనన్ తమ తమ మొబైల్ ఫోన్‌లను ఉపయోగించి ఒకరికొకరు లైవ్ క్రాస్ బోర్డర్ లావాదేవీలు చేసుకున్నారు.

క్రాస్ బోర్డర్ పర్సన్ టు పర్సన్ (పీ2పీ) చెల్లింపు సౌకర్యం ప్రారంభించబడిన మొదటి దేశం సింగపూర్. ఇది సింగపూర్‌ లోని భారతీయ ప్రవాసులకు, ప్రత్యేకించి వలస కార్మికులు/విద్యార్థులకు సహాయం చేస్తుందని తెలిపారు. అలాగే సింగపూర్ నుండి భారతదేశానికి తక్షణం మరియు తక్కువ ఖర్చుతో డబ్బు బదిలీ చేయడం ద్వారా సామాన్యులకు డిజిటలైజేషన్ మరియు ఫిన్ టెక్ ప్రయోజనాలను అందజేస్తుందన్నారు. సింగపూర్‌లోని ఎంపిక చేయబడిన మర్చంట్ అవుట్‌లెట్‌లలో క్యూఆర్ కోడ్‌ల ద్వారా యూపీఐ చెల్లింపుల ఆమోదం ఇప్పటికే అందుబాటులో ఉందని తెలిపారు.

మరోవైపు భార‌త్ యూపీఐ-సింగ‌పూర్ పేనౌ మధ్య లింకేజ్ వర్చువల్ లాంచ్‌ కు ముందు ఇద్దరు ప్రధాన మంత్రులు ఫోన్ కాల్ ద్వారా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై చర్చలు జరిగాయని ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. భారతదేశం-సింగపూర్ బంధాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగస్వామ్యానికి ప్రధాని లీ కి ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే భారతదేశం యొక్క జీ20 ప్రెసిడెన్సీలో సింగపూర్ ప్రధానితో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 16 =