హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో సత్తా చాటిన ‘ఆర్ఆర్ఆర్’, ఏకంగా ఐదు అవార్డులు కైవసం

SS Rajamoulis RRR Movie Wins 5 Hollywood Critics Association Film Awards Include Best International Film, SS Rajamoulis RRR Movie, RRR Wins 5 Hollywood Film Awards,RRR 5 Hollywood Critics Association Awards, RRR Best International Film, Mango News, Mango News Telugu, Rrr Movie Full Form 2022,Rrr Budget,Rrr Collection Worldwide 14 Days,Rrr Collection Worldwide Till Now,Rrr Release Date,Rrr Trailer,Ss Rajamouli Cameo In Rrr,Ss Rajamouli Payment For Rrr,Ss Rajamouli Remuneration For Rrr,Ss Rajamouli Rrr Cast,Ss Rajamouli Rrr Fees,Ss Rajamouli Rrr Full Form,Ss Rajamouli Rrr Movie,Ss Rajamouli Rrr Release Date,Ss Rajamouli Rrr Trailer

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విశేష ప్రజాదరణ చూరగొన్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇప్పటికే గోల్డెన్‌ గ్లోబ్‌, క్రిటిక్స్ ఛాయిస్‌ సహా పలు అంతర్జాతీయ అవార్డులను సైతం సొంత చేసుకుంది. ఈ క్రమంలో తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిసింది. అమెరికాలోని కాలిఫోర్నియా వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్’ (హెచ్‌సీఏ) ఫిల్మ్ అవార్డులలో సత్తా చాటింది. దీనిలో భాగంగా పలు హాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టి మరీ ఏకంగా 5 విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది. దీంతో ఈ హెచ్‌సీఏ ఫిల్మ్ అవార్డుల్లో ఒకేసారి 5 అవార్డులు గెలుచుకున్న తొలి భారతీయ సినిమాగా రికార్డు సృష్టించింది.

బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం, బెస్ట్‌ యాక్షన్‌ ఫిలిం, బెస్ట్‌ స్టంట్స్‌, బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు హెచ్‌సీఏ అవార్డులు వరించాయి. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా అద్భుత ప్రేక్షకాదరణ పొందిన చిత్రంగా గుర్తింపు పొందడంతో ‘హెచ్‌సీఏ స్పాట్‌లైట్‌’ అవార్డును సైతం సొంతం చేసుకుంది. ఇక బెస్ట్‌ పిక్చర్‌, బెస్ట్‌ డైరెక్టర్‌ కేటగిరీల్లోనూ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా హెచ్‌సీఏ అవార్డుల కోసం నామినేట్‌ అవడంతో అవి కూడా రావొచ్చని అభిమానులు భావించారు. కానీ ఈ రెండు కేటగిరీల్లో ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ ది వన్స్‌’ సినిమా అవార్డులు గెలుచుకుంది. కాగా ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌ కోసం ఫైనల్‌ నామినేషన్స్‌కు ఎంపికైన విషయం తెలిసిందే. వచ్చే నెల 12న 2023 ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది.

ఇక ఈ అవార్డుల ప్రదానోత్సవంలో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, నటుడు రామ్‌చరణ్‌, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, కెమేరామెన్ సెంథిల్ కుమార్ మరియు సినిమాకు లైన్ ప్రొడ్యూసర్‌గా పనిచేసిన కార్తికేయ తదితరులు పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు అవార్డులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ సినిమాలో స్టంట్స్ కొరియోగ్రఫీ చేసిన సాల్మన్ సహా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ సినిమా మొత్తం 320 రోజుల పాటు షూటింగ్ జరుపుకోగా.. అందులో ఎక్కువ రోజులు కేవలం స్టంట్స్ కోసమే పనిచేశాం. ముఖ్యంగా నా హీరోలు ఎన్టీఆర్ మరియు రామ్‌చరణ్‌ యాక్షన్ ఘట్టాల్లో కష్టపడి నటించారు. ఈ అవార్డులు కేవలం నాకు, నా సినిమాకు వచ్చినట్లు భావించడం లేదు. మొత్తం మా భారతీయ చిత్ర పరిశ్రమకే దక్కిన గౌరవం. మేరా భారత్ మహాన్, జై హింద్” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 17 =