రాజకీయ వర్గాలలో ఆసక్తి రేపుతున్న బ్రదర్ అనిల్ ఏపీ పర్యటన

YS Sharmila's Husband Brother Anil Meets with Various Communities in Andhra Pradesh Today, YS Sharmila's Husband Brother Anil, Brother Anil Meets with Various Communities in Andhra Pradesh Today, Brother Anil Meets with Various Communities in Andhra Pradesh, Brother Anil Meets with Various Communities in AP, YS Sharmila's Husband, Brother Anil, Latest News About Brother Anil, Latest Updates About Brother Anil, Latest News And Updates About Brother Anil, Brother Anil Kumar, YS Sharmila, YS Sharmila's Husband Brother Anil Kumar, Anil Kumar Morusupalli, Manog News, Manog News Telugu,

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ వర్గాలలో ‘బ్రదర్ అనిల్’ నిర్వహిస్తున్న వరుస సమావేశాలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి కి స్వయానా బావ అయిన ‘బ్రదర్‌ అనిల్‌’ ఈరోజు విజయవాడలోని ఓ హోటల్‌లో బీసీ, మైనారిటీ, క్రిస్టియన్‌ సంఘాల నేతలు అనిల్‌తో సమావేశమయ్యారు. ఇప్పటికే సీఎం జగన్ సోదరి షర్మిల తెలంగాణాలో పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా వైఎస్సాఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల భర్త.. అనిల్‌ ఏపీలోని పలు సంఘాల నాయకులతో సమావేశం కావడం రాజకీయ వర్గాలలో ఆసక్తి రేపుతోంది.

“గత ఎన్నికల్లో ‘బ్రదర్‌ అనిల్‌’ చెప్పటం వల్లనే వైసీపీకి ఓటేశామని, కానీ.. ప్రస్తుతం రాష్ట్రంలో తాము ఆశించినట్లుగా పాలన సాగటం లేదని” ఈ సందర్భంగా ఆయా సంఘాల నేతలు అన్నట్లుగా వార్తలొస్తున్నాయి. తమ అభిప్రాయాన్ని ఆయనకు తెలిపామని.. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని అనిల్‌ వెల్లడించారని సమావేశంలో పాల్గొన్న నేతలు చెప్పారు. దీంతో బ్రదర్ అనిల్‌ కొత్త పార్టీ పెట్టొచ్చంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, ఏపీలో కొత్త పార్టీ పెడుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని అనిల్ ఖండించారు. ప్రస్తుతానికి అటువంటి ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రాలో పార్టీ అంశం మొత్తం ఊహాగానాలేనని ఆయన అన్నారు. అలాంటి ఆలోచన ఏమైనా ఉంటే తానే స్వయంగా మీడియా ముందుకు వచ్చి వివరాలను వెల్లడిస్తానని బ్రదర్ అనిల్ చెప్పుకొచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here