మహర్షి దయానంద్ సరస్వతి 200వ జయంతి: ఏడాదిపాటు జరిగే వేడుకలను రేపు ఢిల్లీలో ప్రారంభించనున్న ప్రధాని మోదీ

PM Modi to Inaugurate the Year Long Celebrations Commemorating 200th Birth Anniversary of Maharishi Dayanand Saraswati on 12th FEB,PM Modi to Inaugurate,Year Long Celebrations,200th Birth Anniversary,Maharishi Dayanand Saraswati,Dayanand Saraswati Birth Anniversary,Mango News,Mango News Telugu,5 Teachings Of Swami Dayanand Saraswati,Dayanand Saraswati Death,Dayanand Saraswati In Hindi,Maharishi Swami Dayanand Saraswati,Maharshi Dayanand Saraswati,Maharshi Dayanand Saraswati Jayanti,Maharshi Dayanand Saraswati Jayanti 2022,Maharshi Dayanand Saraswati Jayanti In Hindi,Swami Dayanand Saraswati Biography ,Swami Dayanand Saraswati Real Name,Swami Dayanand Saraswati Short Biography,Swami Dayanand Saraswati Wikipedia

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (ఫిబ్రవరి 12, ఆదివారం) ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో మహర్షి దయానంద్ సరస్వతి 200వ జయంతిని స్మరించుకుంటూ ఏడాది పాటు జరిగే వేడుకలను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

1824, ఫిబ్రవరి 12న జన్మించిన మహర్షి దయానంద్ సరస్వతి ఒక సంఘ సంస్కర్త. అతను 1875లో అప్పటి ప్రబలంగా ఉన్న సామాజిక అసమానతలను ఎదుర్కోవడానికి ఆర్యసమాజ్‌ని స్థాపించాడు. ఆర్యసమాజ్ సామాజిక సంస్కరణలు మరియు విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా దేశం యొక్క సాంస్కృతిక మరియు సామాజిక మేల్కొలుపులో కీలక పాత్ర పోషించింది. “సాంఘిక సంస్కర్తలు మరియు ముఖ్యమైన వ్యక్తులను సెలెబ్రేట్ చేసుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రత్యేకించి దేశానలుమూలల ఇంకా చేరని గొప్ప వ్యక్తుల గురించి, అందరికి తెలియజేప్పే కార్యక్రమాలు చేస్తున్నాం. భగవాన్ బిర్సా ముడా జన్మదినాన్ని జనజాతీయ గౌరవ్ దివస్‌గా ప్రకటించడం నుండి శ్రీ అరబిందో 150వ జయంతిని స్మరించుకునే కార్యక్రమంలో పాల్గొనడం వరకు ప్రధాని మోదీ ఇటువంటి కార్యక్రమాలకు ముందు ఉండి నాయకత్వం వహిస్తున్నారు” అని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =