భారత్ యొక్క జీ-20 ప్రెసిడెన్సీ లోగో, థీమ్, వెబ్‌సైట్‌ను రేపు ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ

PM Modi will Unveil the Logo Theme and Website of India’s G20 Presidency on 8th November, Modi Unveil Logo G20 Presidency,Modi Unveil Theme G20 Presidency,G20 Presidency Website Launch,Mango News,Mango News Telugu,PM Narendra Modi Latest News And Updates,PM Narendra Modi, India’s G20 Presidency,G20 Presidency Launch, PM Modi Launch G20 Presidency, G20 Presidency News And Updates, Indian Prime Minister Latest News

భారతదేశం 2022, డిసెంబర్ 1 నుండి జీ-20 ప్రెసిడెన్సీ/జీ-20 స‌భ్య దేశాల గ్రూప్ అధ్య‌క్ష ప‌ద‌వి చేపట్టనున్న విషయం తెలిసిందే. అలాగే భారత్ తొలిసారిగా 2023లో జీ-20 సమ్మిట్‌ కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో భారతదేశం యొక్క G20 ప్రెసిడెన్సీ లోగో, థీమ్ మరియు వెబ్‌సైట్‌ను నవంబర్ 8, మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

ప్రధాని మోదీ దార్శనికతతో మార్గనిర్దేశం చేయబడిన భారతదేశ విదేశాంగ విధానం ప్రపంచ వేదికపై నాయకత్వ పాత్రలను చేపట్టేలా అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ దిశలో ఒక ముఖ్యమైన అడుగులో భాగంగా భారతదేశం 2022, డిసెంబర్ 1 నుండి జీ-20 ప్రెసిడెన్సీని చేపట్టనుందని తెలిపారు. జీ-20 ప్రెసిడెన్సీ అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన సమస్యలపై ప్రపంచ ఎజెండాకు సహకరించడానికి భారతదేశానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుందని, ఈ క్రమంలో మన యొక్క జీ-20 ప్రెసిడెన్సీ యొక్క లోగో, థీమ్ మరియు వెబ్‌సైట్ భారతదేశ సందేశాన్ని మరియు ప్రపంచానికి విస్తృతమైన ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. భారతదేశం తన జీ-20 ప్రెసిడెన్సీ సమయంలో, భారతదేశం అంతటా అనేక ప్రదేశాలలో 32 విభిన్న రంగాలలో సుమారు 200 సమావేశాలను నిర్వహిస్తుందని, అలాగే వచ్చే ఏడాది జరగనున్న జీ-20 సమ్మిట్, భారతదేశం నిర్వహించే అత్యున్నత స్థాయి అంతర్జాతీయ సమావేశాలలో ఒకటి అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − seventeen =