నేడు మహారాష్ట్ర, గోవాలలో పర్యటించనున్న ప్రధాని మోదీ, నాగ్‌పూర్ మెట్రో ఫేజ్-1 జాతికి అంకితం

PM Modi will Visit Maharashtra and Goa Today will Dedicate Nagpur Metro Phase-1 to the Nation,Prime Minister Modi tour,Prime Minister Modi Maharashtra Tour,Prime Minister Modi Goa tour,Nagpur Metro Phase-1,Mango News,Mango News Telugu,Prime Minister Modi,Prime Minister Modi Latest News and Updates,Prime Minister News and Live Updates,Prime Minister Narendra Modi,Narendra Modi News and Updates,Narendra Modi News and Live Updates,Nagpur Metro,Nagpur Metro News and Live Updates,Nagpur Metro News and Live Updates

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు (డిసెంబర్ 11, ఆదివారం) మహారాష్ట్ర మరియు గోవా రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా ప్రధాని మోదీ ఉదయం 9:30 గంటలకు నాగ్‌పూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని, అక్కడ నాగ్‌పూర్-బిలాస్‌పూర్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రధాని ఫ్రీడమ్ పార్క్ మెట్రో స్టేషన్ నుండి ఖాప్రి మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైడ్ చేస్తారు, అక్కడ ఆయన ‘నాగ్‌పూర్ మెట్రో ఫేజ్-1’ను జాతికి అంకితం చేయనున్నారు. ఈ సందర్భంగా ఖాప్రి నుండి ఆటోమోటివ్ స్క్వేర్ (ఆరెంజ్ లైన్) మరియు ప్రజాపతి నగర్ నుండి లోకమాన్య నగర్ (ఆక్వా లైన్) వరకు రెండు మెట్రో రైళ్లను ఖాప్రీ మెట్రో స్టేషన్‌లో ప్రధాని జెండా ఊపి ప్రారంభిస్తారు. నాగ్‌పూర్ మెట్రో ఫేజ్-1 ను రూ.8650 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేశారు. అనంతరం రూ.6700 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేయనున్న నాగ్‌పూర్ మెట్రో ఫేజ్-2కి కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.

ఉదయం 10:45 గంటలకు నాగ్‌పూర్ మరియు షిర్డీలను కలిపే సమృద్ధి మహామార్గ్ ఫేజ్-1 ను ప్రారంభిస్తారు మరియు హైవేలో పర్యటనను చేపడతారు. అలాగే నాగ్‌పూర్‌లోని ఎయిమ్స్‌ను ఉదయం 11:15 గంటలకు ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తారు. అదేవిధంగా నాగ్‌పూర్‌లో ఉదయం 11:30 గంటలకు జరిగే బహిరంగ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని రూ.1500 కోట్ల కంటే ఎక్కువ విలువైన జాతీయ రైలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వన్ హెల్త్ (ఎన్ఐఓ), మరియు నాగ్ నది కాలుష్య నివారణ ప్రాజెక్ట్ లకు కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు. ఈ కార్య‌క్ర‌మంలో, ప్ర‌ధాని మోదీ ‘సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ’ చంద్రపూర్ ని కూడా దేశానికి అంకితం చేయడంతో పాటుగా ‘సెంటర్ ఫర్ రీసెర్చ్, మేనేజ్‌మెంట్ అండ్ కంట్రోల్ ఆఫ్ హిమోగ్లోబినోపతీస్, చంద్రాపూర్’ ని ప్రారంభించనున్నారు.

అనంతరం గోవాకు చేరుకొని మధ్యాహ్నం 3:15 గంటలకు 9వ ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ వేడుకలో ప్రధాని పాల్గొని ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో మూడు జాతీయ ఆయుష్ ఇన్‌స్టిట్యూట్‌లను కూడా ప్రధాని ప్రారంభిస్తారు. ఇక సాయంత్రం 5:15 గంటలకు గోవాలోని మోపా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − two =