రాబోయే 10 సంవత్సరాల్లో దేశంలో రికార్డు స్థాయిలో వైద్యులు తయారయ్యే అవకాశం: ప్రధాని మోదీ

PM Narendra Modi Dedicates KK Patel Super Speciality Hospital in Bhuj to the Nation, PM Modi Dedicates KK Patel Super Speciality Hospital to the Nation, KK Patel Super Speciality Hospital in Bhuj, KK Patel Super Speciality Hospital, PM Modi Inaugurates KK Super Speciality Hospital In Bhuj Says Medical Facility Will Better In Coming 10 Years, Modi Inaugurates KK Super Speciality Hospital In Bhuj Says Medical Facility Will Better In Coming 10 Years, PM Modi Inaugurates KK Super Speciality Hospital In Bhuj, PM Modi Says Medical Facility Will Better In Coming 10 Years, KK Super Speciality Hospital In Bhuj, KK Super Speciality Hospital, Medical Facility Will Better In Coming 10 Years Says Pm Modi, KK Super Speciality Hospital News, KK Super Speciality Hospital Latest News, KK Super Speciality Hospital Latest Updates, KK Super Speciality Hospital Live Updates, PM Modi, Narendra Modi, Prime Minister of India, Narendra Modi Prime Minister of India, PM Narendra Modi, Prime Minister Narendra Modi, Mango News, Mango News Telugu,

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్‌లోని భుజ్‌లో కేకే పటేల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని జాతికి అంకితం చేశారు. ఈ ఆసుపత్రిని శ్రీ కుచ్చి లేవా పటేల్ సమాజ్ నిర్మించింది. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, భూకంపం సృష్టించిన విధ్వంసాన్ని తట్టుకుని భుజ్, కుచ్ ప్ర‌జ‌లు త‌మ కష్టంతో ఇప్పుడు ఈ ప్రాంతానికి కొత్త చరిత్ర రాస్తున్నారని ప్ర‌శంసించారు. ఇది ఈ ప్రాంతంలోని మొట్టమొదటి ఛారిటబుల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అని, కుచ్ ప్రజలతో పాటుగా లక్షలాది మంది సైనికులు, పార్లమెంటరీ సిబ్బంది మరియు వ్యాపారులకు నాణ్యమైన వైద్య చికిత్సకు హామీగా ఇది పని చేస్తుందని అన్నారు.

రాబోయే 10 సంవత్సరాల్లో దేశంలో రికార్డు స్థాయిలో వైద్యులు తయారయ్యే అవకాశం:

మరోవైపు దేశంలో జనౌషధి యోజనతో పాటు పేద మరియు మధ్యతరగతి కుటుంబాల చికిత్సలో ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయలను ఆదా చేయడంలో ఆయుష్మాన్ భారత్ పథకం కీలకంగా పనిచేస్తుందన్నారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ అందరికీ చికిత్సను అందుబాటులోకి తీసుకురావడానికి సహాయపడిందని ప్రధాని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ రోగులకు సౌకర్యాలను మరింత విస్తరిస్తోందని, జిల్లాల్లో ఆయుష్మాన్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ద్వారా ఆధునిక మరియు క్రిటికల్ హెల్త్ కేర్ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయబడ్డాయన్నారు. ప్రతి జిల్లాలో కూడా ఆసుపత్రిని నిర్మిస్తున్నామని, అదేవిధంగా ఎయిమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మెడికల్ కాలేజీలు కూడా వైద్య విద్యను అందరికీ చేరువ చేస్తుండడంతో రాబోయే 10 సంవత్సరాల్లో దేశం రికార్డు స్థాయిలో వైద్యులు తయారయ్యే అవకాశం ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

గుజరాత్‌ లో వైద్యపరమైన మౌలిక సదుపాయాలు, వైద్య విద్య గురించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, గతంలో 9 మెడికల్ కాలేజీలు ఉండగా, నేడు 1 ఎయిమ్స్, 36కు పైగా మెడికల్ కాలేజీలు ఉన్నాయని అన్నారు. మెడికల్ సీట్లు 1100 నుండి 6000కి పెరిగాయని, రాజ్‌కోట్ ఏయిమ్స్ లో కూడా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని అన్నారు. అహ్మదాబాద్‌లోని సివిల్ హాస్పిటల్ లో తల్లి మరియు పిల్లల సంరక్షణ కోసం 1500 పడకలతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని, కార్డియాలజీ మరియు డయాలసిస్ సౌకర్యాలు అనేక రెట్లు పెరిగాయని ప్రధాని మోదీ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × three =