జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పుల దాడి, తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ

PM Narendra Modi has Expressed Deep Distress on the Assault on Japan Ex PM Abe Shinzo, Narendra Modi has Expressed Deep Distress on the Assault on Japan Ex PM Abe Shinzo, PM Modi has Expressed Deep Distress on the Assault on Japan Ex PM Abe Shinzo, Modi has Expressed Deep Distress on the Assault on Japan Ex PM Abe Shinzo, Assault on Japan Ex PM Abe Shinzo, PM Narendra Modi has Expressed Deep Distress, Japan Ex PM Shinzo Abe Shot in Chest During Campaign Speech at Nara Rushed to Hospital, Ex PM Shinzo Abe Shot in Chest During Campaign Speech at Nara Rushed to Hospital, Shinzo Abe Shot in Chest During Campaign Speech at Nara Rushed to Hospital, Former Japanese PM Shinzo Abe shot in chest during a event, Japan Ex PM Shinzo Abe Shot in Chest During Campaign Speech, Japan Ex PM Shinzo Abe Campaign Speech at Nara, Campaign Speech, Japan Ex PM Shinzo Abe Shot in Chest, Former Japanese PM Shinzo Abe, Japan Ex PM Shinzo Abe, Japanese PM Shinzo Abe, Shinzo Abe, Japanese, Assault on Japan Ex PM Abe Shinzo News, Assault on Japan Ex PM Abe Shinzo Latest News, Assault on Japan Ex PM Abe Shinzo Latest Updates, Assault on Japan Ex PM Abe Shinzo Live Updates, Mango News, Mango News Telugu,

జపాన్‌ మాజీ ప్రధానమంత్రి షింజో అబేపై జరిగిన దాడిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ “నా ప్రియమైన మిత్రుడు అబే షింజోపై జరిగిన దాడితో తీవ్ర మనోవేదనకు గురయ్యాను. మా ఆలోచనలు మరియు ప్రార్థనలు అతనితో, అతని కుటుంబ సభ్యులతో మరియు జపాన్ ప్రజలతో ఉన్నాయి” అని పేర్కొన్నారు. షింజో అబేపై జరిగిన కాల్పుల దాడిపై ప్రధాని మోదీ సహా పలు ప్రపంచ దేశాల అధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.

ముందుగా శుక్రవారం పశ్చిమ జపాన్‌లోని నరా నగరంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ తరపున షింజో అబే పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేజ్‌పై షింజో ప్రసంగిస్తున్న సమయంలో ఒక దుండగుడు ఆయనపై వెనుక నుంచి కాల్పులు జరిపారు. కాల్పుల గాయాలతో ఒక్కసారిగా షింజో అబే వేదికపైనే కుప్పకూలిపోయారు. అనంతరం షింజోను భద్రతా సిబ్బంది వెంటనే అత్యవసర వాహనంలో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే షింజో పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఘటనపై జపాన్ ప్రధాని పూమియో కీషీదా స్పందిస్తూ, షింజోను కాపాడేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఆయన క్షేమంగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్దిస్తునట్టు తెలిపారు. ఇలాంటి హింసాత్మక ఘటనలను సహించేది, క్షమించేది లేదన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − nine =