ఏపీలో రానున్న ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు కేటాయిస్తాం – మహానాడు వేదికపై చంద్రబాబు కీలక ప్రకటన

Mahanadu TDP Chief Chandrababu Announces 40% Seats To Be Allocated For Youth Coming Elections in AP, TDP Chief Chandrababu Announces 40% Seats To Be Allocated For Youth Coming Elections in AP, Chandrababu Announces 40% Seats To Be Allocated For Youth Coming Elections in AP, TDP Chief Chandrababu Naidu Announces 40% Seats To Be Allocated For Youth Coming Elections in AP, 40% Seats To Be Allocated For Youth Coming Elections in AP, Coming Elections in AP, TDP Chief Chandrababu Naidu Announces 40% Seats To Be Allocated For Youth, Chandrababu Naidu Announces 40% Seats To Be Allocated For Youth, TDP Chief Chandrababu Naidu, TDP Chief Chandrababu, Chandrababu Naidu, Nara Chandrababu Naidu, AP TDP Gears Up For Annual Conclave In Ongole, Mahanadu Programme will be organised in Ongole from May 27 to 29, TDP gears up for annual conclave Mahanadu Programme at Ongole, AP TDP gears up to organise two day Mahanadu conclave, Ongole town turns yellow, Mahanadu Programme at Ongole Starts From Today, Mahanadu conclave, Mahanadu Programme News, Mahanadu Programme Latest News, Mahanadu Programme Latest Updates, Mahanadu Programme Live Updates, Mango News, Mango News Telugu,

ఏపీలో వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు కేటాయిస్తామని మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఒంగోలులో నేడు ప్రారంభమైన మహానాడు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మన నాయకుడు స్వర్గీయ ఎన్ఠీఆర్ శత జయంతి ఉత్సవాల సమయంలో మహానాడు జరుపుకోవడం చాలా ఆనందాన్నిస్తోందని పేర్కొన్నారు. పార్టీ పెట్టి 40 సంవత్సరాలవుతోందని, ప్రస్తుతం పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించాల్సిన అవసరం ఉందని తెలిపారు. దీనికి సంబంధించి మహానాడు వేదికగా కీలక నిర్ణయం తీసుకుంటున్నామని, వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే కేటాయిస్తామని ప్రకటించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్లకి అవకాశాలు ఇస్తామని, యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలని చెప్పారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్లకి అవకాశాలు ఇస్తామని, యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలని చంద్రబాబు చెప్పారు.

పార్టీలోని అన్ని స్థాయిల్లో సమర్ధవంతమైన నాయకత్వాన్ని రూపొందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యువతకు ఎక్కువ టిక్కెట్లు ఇస్తూనే సీనియర్ నేతలకు ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని టీడీపీ అధినేత తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం చారిత్రక అవసరమని అన్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటంలో ముందుండే యువకులకు పార్టీ టిక్కెట్లు ఇస్తాం అని స్పష్టం చేశారు. టీడీపీలో 70 లక్షల మంది సభ్యులు ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో వారంతా ముందుండి పార్టీకి విజయం అందించాలని కోరారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో రూ.2 లకే కేజీ బియ్యం, పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం వంటి సాహసోపేతమైన నిర్ణయాలు, పరిపాలనలో ఎన్టీఆర్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 3 =