తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు 12,91,006 దరఖాస్తులు, ఆగస్టు 7న ఎస్సై, 21న కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్?

TS Police Recruitment-2022 A Total of 1291006 Applications Received for 17516 Posts, A Total of 1291006 Applications Received for 17516 Posts, TS Police Recruitment-2022, 2022 TS Police Recruitment, TS Police Recruitment, Telangana State Level Police Recruitment Board, 1291006 Applications Received for 17516 Posts, 17516 Posts, 1291006 Applications, TS Police Constable Recruitment 2022, 2022 TS Police Constable Recruitment, TS Police Recruitment 2022 for SI posts, 2022 TS Police Recruitment for SI posts, TS Police Recruitment News, TS Police Recruitment Latest News, TS Police Recruitment Latest Updates, TS Police Recruitment Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల‌కు దర‌ఖా‌స్తు గడువు మే 26, గురువారం రాత్రి 10 గంటలకు ముగియగా, 12,91,006 దరఖాస్తులు వచ్చినట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్బీ) వెల్లడించింది. రాష్ట్రంలో పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్, జైళ్లు అండ్ కరెక్షనల్ సర్వీసెస్, రవాణా మరియు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ వంటి డిపార్ట్మెంట్స్ కు సంబంధించి మొత్తం 17,516 పోస్టుల భర్తీకి ఇటీవలే టీఎస్‌ఎల్‌పీఆర్బీ 7 నోటిఫికేషన్స్ విడుదల చేసింది. ఇందులో 587 ఎస్సై/ఏఎస్సై స్థాయి పోస్టులు, 16929 కానిస్టేబుల్ స్థాయి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు మే 2వ తేదీ నుండి దరఖాస్తు స్వీకరణ ప్రారంభం కాగా, దరఖాస్తు గడువు మే 26తో ముగిసింది. ఈ నేపథ్యంలో 17,516 పోస్టులకు మొత్తం 12,91,006 దరఖాస్తులు వచ్చాయని,
తదుపరి డిడిప్లికేషన్, ధృవీకరణలు/చెల్లనివి మొదలైన వాటి కారణంగా ఈ సంఖ్యలో స్వల్ప మార్పులు ఉండవచ్చని తెలిపారు. 2018 పోలీస్ నియామక ప్రక్రియకు వచ్చిన దరఖాస్తులు (7,19,840) కంటే ప్రస్తుతం దాదాపు 80% ఎక్కువగా వచ్చాయన్నారు.

ఈ 12,91,006 దరఖాస్తులును వివిధ రకాల పోస్టుల కోసం 7,33,559 మంది అభ్యర్థులు దాఖలు చేశారని తెలిపారు. అలాగే మొత్తం దరఖాస్తుల్లో మహిళా అభ్యర్థులు 21 శాతం అనగా 2,76,311 దరఖాస్తులు చేశారని చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట వంటి 5 జిల్లాల నుంచే అత్యధికంగా దాదాపు 33% దరఖాస్తులు వచ్చాయని, ములుగు, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నారాయణపేట, జనగాం, సిరిసిల్ల వంటి 6 జిల్లాల నుంచి మొత్తం దరఖాస్తుల్లో కేవలం 7% మాత్రమే వచ్చాయన్నారు. దాదాపు 67% మంది అభ్యర్థులు ఆప్టిట్యూడ్ కోసం పరీక్ష మాధ్యమంగా తెలుగును ఎంచుకోగా, 32.8% కంటే ఎక్కువ మంది ఇంగ్లీషును, కేవలం 0.2% మంది అభ్యర్థులు మాత్రమే ఉర్దూను ఎంచుకున్నారని తెలిపారు.

ఆగస్టు 7న ఎస్సై, 21న కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష?

12,91,006 దరఖాస్తుల్లో 2,47,630 దరఖాస్తులు ఎస్సై సివిల్/తత్సమాన స్థాయి పోస్టుల కోసం రాగా, 9,54,064 దరఖాస్తులు అన్ని డిపార్ట్మెంట్స్ లోని కానిస్టేబుల్ సివిల్/తత్సమాన స్థాయి పోస్టుల కోసం వచ్చాయని చెప్పారు. ఇక దాదాపు 2.5 లక్షల మంది అభ్యర్థులుకు ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష ఆగస్టు 7, ఆదివారం నాడు నిర్వహించే అవకాశం ఉందని, అదేవిధంగా 6.6 లక్షల మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు ఆగస్టు 21, ఆదివారం నాడు ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించబడే అవకాశం ఉందని తెలిపారు. కాగా ఖచ్చితమైన తేదీలు త్వరలో నిర్ధారించబడతాయని టీఎస్‌ఎల్‌పీఆర్బీ వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 7 =