మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధాని మోదీ

PM Narendra Modi Pays Tribute To India's First PM Pandit Jawaharlal Nehru on His Birth Anniversary Today,PM Narendra Modi,First PM Pandit Jawaharlal Nehru,Nehru Birth Anniversary,Mango News,Mango News Telugu,Pandit Jawaharlal Nehru,Narendra Modi Latest News And Updates,PM Narendra Modi News And Live Updates,Jawaharlal Nehru,Nehru Anniversary,November 14th, Childrens Day, Indian Childrens Day,Nehru Birth Anniversary

భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ ట్విట్టర్ లో సందేశం ఉంచారు. మన మాజీ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జీకి జయంతి సందర్భంగా నివాళులు. మన దేశానికి ఆయన చేసిన సేవలను కూడా మనం గుర్తుచేసుకోవాల్సిన సమయం ఇది’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కాగా 1889లో జన్మించిన నెహ్రూ దేశానికి తొలి ప్రధానిగా పనిచేశారు. ఇక ఆయన ప్రధాని పదవిలో ఉండగానే 1964లో మరణించారు. అలాగే ఎక్కువ కాలం పనిచేసిన భారత ప్రధానమంత్రిగా కూడా జవహర్‌లాల్ నెహ్రూ రికార్డ్ సృష్టించారు.

ఇక కాంగ్రెస్ కూడా జవహర్‌లాల్ నెహ్రూకు ఘనంగా నివాళులు అర్పించింది. నెహ్రూ అద్భుతమైన సహకారం లేకుండా 21వ శతాబ్దపు భారతదేశాన్ని ఊహించలేమని పేర్కొంది. న్యూఢిల్లీలోని నెహ్రూ స్మారకం శాంతి వనానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రగతిశీల ఆలోచనలు సవాళ్లు ఉన్నప్పటికీ భారతదేశం యొక్క సామాజిక, రాజకీయ మరియు ఆర్థిక అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాయని ఖర్గే అభిప్రాయపడ్డారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − four =