17వ జీ-20 సమ్మిట్: నేటి నుంచి 16 వరకు ఇండోనేషియాలోని బాలిలో పర్యటించనున్న ప్రధాని మోదీ

PM Modi will Visit Bali Indonesia from November 14-16 to Attend the 17th G20 Summit, Modi Unveil Logo G20 Presidency,Modi Unveil Theme G20 Presidency,G20 Presidency Website Launch,Mango News,Mango News Telugu,PM Narendra Modi Latest News And Updates,PM Narendra Modi, India’s G20 Presidency,G20 Presidency Launch, PM Modi Launch G20 Presidency, G20 Presidency News And Updates, Indian Prime Minister Latest News

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 14-16 తేదీలలో ఇండోనేషియాలోని బాలిలో పర్యటించనున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఆహ్వానం మేరకు 17వ G20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ సోమవారం బాలికి వెళ్లనున్నారు. ఈ మేరకు కేంద్ర విదేశీవ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేసింది. బాలిలో సమ్మిట్ సందర్భంగా, జీ-20 నాయకులు “రికవర్ టుగెథెర్, రికవర్ స్టాంగర్” అనే సమ్మిట్ థీమ్ కింద ప్రపంచ ఆందోళనకు సంబంధించిన కీలక అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. జీ-20 సమ్మిట్ ఎజెండాలో భాగంగా ఆహారం అండ్ ఇంధన భద్రత, ఆరోగ్యం మరియు డిజిటల్ పరివర్తన అనే మూడు వర్కింగ్ సెషన్‌లు నిర్వహించబడనున్నాయి.

ఈ సమ్మిట్ ముగింపు సెషన్‌లో ప్రెసిడెంట్ విడోడో ప్రతీకాత్మకంగా జీ-20 ప్రెసిడెన్సీని ప్రధాని మోదీకి అప్పగించనున్నారు. భారతదేశం 2022, డిసెంబర్ 1 నుండి అధికారికంగా జీ-20 అధ్యక్ష పదవిని చేపట్టనుంది. సమ్మిట్ సందర్భంగా, ప్రధాని మోదీ తన సహచరులతో కొందరితో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. బాలిలోని భారతీయ సమాజాన్ని ఉద్దేశించి కూడా ప్రధాని ప్రసంగించనున్నారు.

జీ-20 లీడర్స్ సమ్మిట్ కోసం బాలి పర్యటనకు వెళ్లేముందు ప్రధాని మోదీ ప్రకటన చేస్తూ, “ఇండోనేషియా అధ్యక్షతన జరగనున్న 17వ జీ-20 లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు నేను నవంబర్ 14-16 తేదీల్లో ఇండోనేషియాలోని బాలిని సందర్శిస్తాను. బాలి సమ్మిట్ సందర్భంగా, ప్రపంచ వృద్ధిని పునరుద్ధరించడం, ఆహారం అండ్ ఇంధన భద్రత, పర్యావరణం, ఆరోగ్యం మరియు డిజిటల్ పరివర్తన వంటి ప్రపంచ ఆందోళనకు సంబంధించిన కీలక అంశాలపై నేను ఇతర జీ-20 నాయకులతో విస్తృత చర్చలు చేస్తాను. జీ-20 సమ్మిట్ సందర్భంగా, అనేక ఇతర దేశాల నాయకులతో సమావేశమవుతాను మరియు వారితో భారతదేశం యొక్క ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షిస్తాను. ఇక నవంబర్ 15న రిసెప్షన్‌లో బాలిలోని భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించడానికి ఎదురుచూస్తున్నాను. మన దేశం మరియు పౌరుల కోసం ఒక ముఖ్యమైన క్షణంలో, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో బాలి సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో భారతదేశానికి G20 ప్రెసిడెన్సీని అందజేయనున్నారు. 2022, డిసెంబర్ 1 నుండి భారతదేశం అధికారికంగా జీ-20 ప్రెసిడెన్సీని స్వీకరిస్తుంది. వచ్చే ఏడాది మన జీ-20 సమ్మిట్‌కు జీ-20 సభ్యులు మరియు ఇతర ఆహ్వానితులకు కూడా నేను నా వ్యక్తిగత ఆహ్వానాన్ని అందిస్తాను. జీ-20 సమ్మిట్‌లో నా పరస్పర చర్యల సమయంలో, భారతదేశం సాధించిన విజయాలను మరియు ప్రపంచ సవాళ్లను సమిష్టిగా పరిష్కరించడంలో మనయొక్క అచంచలమైన నిబద్ధతను హైలైట్ చేస్తాను. భారతదేశం యొక్క జీ-20 ప్రెసిడెన్సీ “వసుధైవ కుటుంబం” లేదా “ఒక భూమి ఒక కుటుంబం ఒక భవిష్యత్తు” అనే థీమ్‌పై ఆధారపడి ఉంటుంది, ఇది సమానమైన వృద్ధి మరియు అందరికీ భవిష్యత్తును పంచుకునే సందేశాన్ని నొక్కి చెబుతుంది” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =