చివరి వన్డేలో దక్షిణాఫ్రికాపై భారత్ ఘనవిజయం, సిరీస్ కైవసం

Team India Beats South Africa in 3rd ODI To Win The Series with 2-1 Lead, Team India Beats South Africa, India Won 3rd ODI, India Won on SA in 3rd ODI, Mango News, Mango News Telugu, India Thrashed South Africa In 3Rd ODI, India Won 3rd ODI By 7 Wickets, India vs South Africa Highlights 3rd ODI, India vs South Africa, India vs South Africa 3rd ODI, Ind vs SA 3rd ODI, India v South Africa, Kuldeep Yadav 4 Wicket Haul, India Vs South Africa 3rd ODI 2022, Ind vs SA Latest News And Updates

త్వరలో టీ20 వరల్డ్‌కప్‌ జరుగనున్న నేపథ్యంలో టీమిండియా మరోసారి సత్తా చాటింది. సిరీస్ నిర్ణాయక చివరి వన్డేలో దక్షిణాఫ్రికాపై చెలరేగి ఆడి ఘనవిజయం సాధించింది. మంగళవారం ఢిల్లీ వేదికగా జరిగిన మూడో వన్డేలో శిఖర్ ధవన్ నాయకత్వంలోని టీమిండియా 7 వికెట్లతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. తద్వారా 2-1తో సిరీస్‌ను గెలుచుకుంది. కాగా దీనికి ముందు దక్షిణాఫ్రికాపై ఇప్పటికే వన్డే సిరీస్‌ గెలుచుకున్న సంగతి తెలిసిందే. సిరీస్ నెగ్గాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా టీమిండియా ఆటగాళ్లు ఆల్‌రౌండ్‌ షోతో మెరిశారు. టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా భారత బౌలర్ల ధాటికి కేవలం 27.1 ఓవర్లలో కేవలం 99 రన్స్‌కు ఆలౌటైంది. కీలకమైన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు చేతులెత్తేశారు.

ముఖ్యంగా స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ కీలకమైన నాలుగు వికెట్లు పడగొట్టడంతో దక్షిణాఫ్రికా 100 పరుగులలోపే కుప్పకూలింది. వాషింగ్టన్ సుందర్, సిరాజ్, షాబాద్ అహ్మద్ తలో రెండు వికెట్లు తీశారు. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో క్లాసెన్‌ ఒక్కడే 34 రన్స్‌తో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక మలన్‌ 15 పరుగులు, యాన్సెన్‌ 14 పరుగులు చేసి దారుణంగా విఫలమయ్యారు. మార్‌క్రమ్‌, మిల్లర్‌, డికాక్ రెండంకెల స్కోరు కూడా అందుకోలేక పోయారు. దీంతో వన్డేల్లో దక్షిణాఫ్రికా ఇండియాపై అత్యల్ప స్కోరు చేసింది. అనంతరం 100 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన భారత్.. 19.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి అలవోకగా అందుకుంది. కెప్టెన్ ధవన్, ఇషాన్ కిషన్ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. అయితే శుభ్‌మన్ గిల్ రాణించాడు. 49 పరుగులు చేసిన గిల్ తృటిలో అర్ధ సెంచరీని కోల్పోయాడు. అతడికి శ్రేయస్ అయ్యర్ 28 పరుగులతో సహకారం అందించాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =