అయోధ్య తీర్పుపై ప్రముఖుల స్పందన

#AYODHYAVERDICT, Ayodhya Case Live Updates, Ayodhya Case Update, Babri Masjid-Ram Janmabhoomi land dispute case in Ayodhya, Entire Disputed Land Goes To Hindus, latest political breaking news, Leaders Welcomes The verdict of Ayodhya, Mango News Telugu, national news headlines today, national news updates 2019, National Political News 2019, Political Parties And Leaders Welcomes The verdict of Ayodhya, Political Parties Welcomes The verdict of Ayodhya, The verdict of Ayodhya

గౌరవనీయమైన సుప్రీంకోర్టు అయోధ్య సమస్యపై తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఎవరికీ విజయం లేదా ఓటమిగా చూడకూడదు. రామ్ భక్తి అయినా, రహీం భక్తి అయినా, భారత దేశ భక్తి స్ఫూర్తిని మనం బలోపేతం చేసుకోవడం ఇప్పుడు చాలా అత్యవసరం. దేశ ప్రజలంతా శాంతి మరియు సామరస్యంతో ఐకమత్యంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. న్యాయ ప్రక్రియ యొక్క స్ఫూర్తితో స్నేహపూర్వకంగా ఏ వివాదం అయినా పరిష్కారమవుతుందని ఈ తీర్పు నిరూపించింది. – ప్రధాని నరేంద్ర మోదీ

అయోధ్య కేసులో సుప్రీం కోర్టు ప్రకటించిన తీర్పును గౌరవిస్తున్నామని కాంగ్రెస్‌ పార్టీ వెల్లడించింది. రామ జన్మభూమి అయినా అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి తాము అనుకూలమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన వర్కింగ్‌ కమిటీ సమావేశంలో తీర్పును గౌరవిస్తూ కాంగ్రెస్‌ పార్టీ తీర్మానం చేసింది. ఈ తీర్పుతో ఆలయ నిర్మాణానికి తలుపులు తెరురుచుకున్నాయని, సుప్రీం కోర్టు తీర్పు ఏ వ్యక్తులకు, సంఘాలు, మతాలు, రాజకీయ పార్టీలకు విజయంగానో, అవమానం నిలవదు – కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిథి రణదీప్ సూర్జేవాలా

సుప్రీం కోర్టు తీర్పు అంతిమ విజేత భారతదేశం, కలిసిమెలసి జీవించాలనుకునే దేశ ప్రజల ఆకాంక్షలకు అందిన విజయమిది. గతాన్ని వదిలిపెట్టి గొప్ప దేశాన్ని నిర్మించుకునేందుకు ముందుకు కదులుదాం – ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తున్నాం. అయితే మేం అంత సంతృప్తిగా లేం. ఈ తీర్పుపై చర్చించిన తర్వాతే భవిష్యత్తు కార్యాచరణ ఏమిటనేది నిర్ణయిస్తాం. తీర్పు కాపీ పూర్తిగా చదివిన తర్వాత మా కమిటీ అంగీకరిస్తే దీనిపై రివ్యూ పిటిషన్‌ వేస్తాం. ఆ విధమైన హక్కు మాకుంది. – సున్నీ వక్ఫ్‌ బోర్డు న్యాయవాది జఫర్‌యాబ్‌ జిలానీ

అయోధ్య కేసు విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రకమైంది. ఈ రకంగా అత్యున్నత న్యాయస్థానం భిన్నత్వంలో ఏకత్వం అనే సందేశాన్ని పంపింది – హిందూ మహాసభ న్యాయవాది వరుణ్‌ కుమార్‌ సిన్హా

అయోధ్య స్థల వివాదంపై సుప్రీం కోర్టు వెలువరించిన చారిత్రాత్మక తీర్పు స్వాగతిస్తున్నాం. అలాగే ఈ సమయంలో ప్రజలంతా సంయమనం పాటించాలి. అత్యుత్తమైన నాయవ్యవస్థ ఇచ్చిన తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాలి. మనదేశంలోని ఏకత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి – అజ్మీర్ దర్గా మత పెద్ద దీవాన్ జైనులబ్దిన్ అలీఖాన్

అయోధ్యపై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దేశ ప్రజలంతా మత సామరస్యాన్ని కాపాడాలి. ఎన్నో సంవత్సరాల వివాదానికి నేడు పరిష్కారం లభించింది. అయోధ్యలో అద్భుతమైన రామ మందిరం నిర్మించుకుందాం – ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

అయోధ్యపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అసంతృప్తికరం, రాజ్యాంగంపై మాకు పూర్తీ నమ్మకం ఉంది, మా హక్కులపై పోరాడతాం. మసీదు కోసం ఇవ్వమన్న 5 ఎకరాల స్థలం మాకొద్దు, ఈ ఆఫర్ ను మేము తిరస్కరిస్తున్నాం – ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ

అయోధ్యపై సుప్రీం కోర్టు తీర్పు స్వాగతిస్తున్నా, రామ జన్మభూమి వివాదాస్పద స్థలంపై సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పును అన్ని వర్గాల ప్రజలు అంగీకరించాలి- కేంద్ర హోం మంత్రి అమిత్ షా

అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం, ఇరు వర్గాల ప్రజలకు ఉపశమనం కలిగింది – ఆధ్యాత్మిక వేత్త శ్రీశ్రీ రవిశంకర్

ఇది చారిత్రక తీర్పు, అయోధ్యలో అద్భుతమైన రామ మందిరం నిర్మిస్తాం. ముస్లింలకు స్థలం కేటాయించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడాన్ని కూడ స్వాగతిస్తున్నాం – యోగ గురువు రాందేవ్ బాబా

అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు ఒక మైలు రాయి లాంటింది, ప్రజలంతా సంయమనంతో ఉండాలి – రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్

అయోధ్య విషయమై తీర్పు వెలువడబోతున్న సందర్భంలో ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే. తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా అందరం హృదయపూర్వకంగా ఆ తీర్పును స్వీకరించాలి. సంయమనం పాటించాలి, మత సామరస్యం కాపాడాలి. శాంతి, సౌభాతృత్వంతో సమసమాజ నిర్మాణమే మన అంతిమలక్ష్యం కావాలి. ప్రజలందరుకూడా సంయమనం పాటించి శాంతి భద్రతలకు సహకరించమని విజ్ఞప్తిచేస్తున్నాను – ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

అయోధ్య విషయమై తీర్పు వెలువడబోతున్న సందర్భంలో ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే. తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా అందరం హృదయపూర్వకంగా ఆ తీర్పును స్వీకరించాలి. సంయమనం పాటించాలి, మత సామరస్యం కాపాడాలి. శాంతి, సౌభాతృత్వంతో సమసమాజ నిర్మాణమే మన అంతిమలక్ష్యం కావాలి – టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + thirteen =