ఇండియాలో మందుబిళ్లలు ఇకపై మరింత ఖరీదు.. రేటు పెరిగిన ‘పారసెటమాల్’ సహా 800 రకాల మెడిసిన్స్

Prices of Paracetamol Azithromycin Among Other Essential Drugs Set To Rise By More Than 10% From April, Prices of Paracetamol Among Other Essential Drugs Set To Rise By More Than 10% From April, Prices of Azithromycin Among Other Essential Drugs Set To Rise By More Than 10% From April, Price of essential medicines set to Hike by 10.7%, Price of essential medicines, Hike In essential medicines Price, Paracetamol Prices Hike by 10.7%, Azithromycin Prices Hike by 10.7%, National List of Essential Medicines, NLEM, Essential Medicines, Essential Medicines Latest News, Essential Medicines Latest Updates, Essential Drugs Set To Rise By More Than 10% From April, Mango News, Mango News Telugu,

ఇండియాలో పారాసెటమాల్, అజిత్రోమైసిన్, ఇతర ముఖ్యమైన ఔషధాల ధరలు ఏప్రిల్ నుండి 10% కంటే ఎక్కువ పెరగనున్నాయి. అలాగే జ్వరం, ఇన్‌ఫెక్షన్లు, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, చర్మవ్యాధులు, రక్తహీనత వంటి అనేక వ్యాధులకు 800 మందుల ధరలు కూడా పెరగనున్నాయి. పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్‌లతో సహా అవసరమైన మందులకు 10 శాతానికి పైగా ధరలు పెంచడానికి ప్రభుత్వం అనుమతించింది. ధరల నియంత్రణలో ఉన్న షెడ్యూల్డ్ డ్రగ్స్‌పై 10.7% ధరల పెంపునకు భారత డ్రగ్ ప్రైసింగ్ అథారిటీ శుక్రవారం అనుమతించింది. నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ (ఎన్‌ఎల్‌ఈఎం) కింద 800కి పైగా మందుల ధరలు ఏప్రిల్ నుంచి పెరగనున్నాయి. ఔషధ ధరల నియంత్రణ సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం షెడ్యూల్ చేయబడిన ఔషధాల ధరలు అనుమతించబడతాయి.

మరోవైపు గత రెండు సంవత్సరాల నుంచి కరోనా మహమ్మారి కారణంగా మందులకు అవసరమైన ముడి పదార్ధాల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పలు ఔషధ కంపెనీలు టాబ్లెట్స్ ధరల పెంపుకై ఎప్పటినుంచో తమ డిమాండ్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో గతేడాది నవంబర్‌లో, 1000 మందికి పైగా భారతీయ ఔషధ తయారీదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న లాబీ గ్రూప్ అన్ని షెడ్యూల్డ్ ఫార్ములేషన్‌ల ధరలను తక్షణమే అమలులోకి వచ్చేలా 10% పెంచడానికి అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరింది. నాన్ షెడ్యూల్డ్ ఔషధాల ధరలను 20% పెంచాలని కూడా కోరింది. ఈ నేపథ్యంలో.. ఆయా డిమాండ్లను పరిశీలించిన ప్రభుత్వం తాజాగా మందుల ధరలు 10% మేర పెంచటానికి అనుమతినిచ్చింది. ఈ కొత్త ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + one =