కబడ్డీ కూతకు వేళాయే – ప్రో కబడ్డీ లీగ్ నేడే ప్రారంభం

Mango News, pkl 2021 auction date, PKL 2021-2022 Schedule, PKL 2021-22, pro kabaddi 2021, pro kabaddi 2021 live, pro kabaddi 2021 schedule, pro kabaddi 2021 starting date, pro kabaddi 2021 team players, Pro Kabaddi League 2021 Season 8, pro kabaddi league 2021 starting date, Pro Kabaddi League 2021-22, Pro Kabaddi League 2021-22 Opening day matches, Pro Kabaddi League 2021-22 Opening day matches LIVE Streaming, Pro Kabaddi League 2021-22 Starts, Pro Kabaddi League 2021-22 Starts From Today, Pro Kabaddi League Season 8, vivo pro kabaddi 2021 schedule

‘లే.. పంగా’ అంటూ అభిమానులని సందడి చేయటానికి పీకేఎల్‌ రెడీ అయింది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రొ కబడ్డీ లీగ్‌ ఎనిమిదో సీజన్‌ వవచ్చేసింది. కరోనా కారణంగా గతేడాది లీగ్‌కు విరామం ప్రకటించారు. ఈ సారి వేలంలో పాల్గొన్న ఆటగాళ్లతో 12 జట్లతో సరికొత్తగా అలరించనుంది. జనవరి 20 వరకు మొత్తం 66 లీగ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆరు టీమ్‌లు ప్లేఆ్‌ఫ్సకు చేరుకోనున్నాయి. నాకౌట్‌ షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు. అయితే, కరోనా నేపథ్యంలో ఈ సీజన్ ను ఒకే వేదిక లోనే నిర్వహించనున్నారు. బెంగళూరు వేదికగా ఖాళీ స్టేడియంలో మ్యాచ్ లను జరపనున్నారు. టోర్నీ మొత్తం బయోబబుల్‌లో సాగేటట్లు ఏర్పాట్లు చేశారు.

కొవిడ్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రేక్షకులను అనుమతించడం లేదు. తొలి నాలుగు రోజులు రోజుకు మూడు మ్యాచ్‌లు, మిగతా రోజుల్లో మాత్రం రెండేసి మ్యాచ్‌లు జరుగుతాయి. శనివారం రోజుల్లో ‘ట్రిపుల్‌ హెడర్‌’ ప్లాన్ చేశారు. బుధవారం జరిగే తొలి మ్యాచ్‌లో మాజీ చాంపియన్‌ యు ముంబాతో బెంగళూరు బుల్స్‌ తలపడనుంది. రెండవ మ్యాచ్ గా తమిళ్‌ తలైవా్‌సతో తెలుగు టైటాన్స్‌.. డిఫెండింగ్‌ చాంప్‌ బెంగాల్‌ వారియర్స్‌తో యూపీ యోధ 3వ మ్యాచ్ ఆడనుంది. గత సీజన్‌ టాప్‌ స్కోరర్‌ పవన్‌ కుమార్‌ షెహ్రావత్‌ బెంగళూరు తరఫున బరిలోకి దిగనున్నాడు. పట్నా పైరేట్స్‌కు ఎక్కువ సీజన్లు ఆడిన ‘డుబ్కీ కింగ్‌’ పర్‌దీప్‌ నర్వాల్‌ ఈసారి యూపీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

దబాంగ్‌ ఢిల్లీకి జోగిందర్‌ నర్వాల్‌, గుజరాత్‌ జెయింట్స్‌కు సునీల్‌ కుమార్‌, హరియాణా స్టీలర్స్‌కు వికాస్‌ ఖండోలా, జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌కు దీపక్‌ హుడా, పట్నా పైరేట్స్‌కు ప్రశాంత్‌ కుమార్‌ రాయ్‌, పుణెరి పల్టన్‌కు నితిన్‌ తోమర్‌ సారథ్యం వహించనున్నారు. తెలుగు టైటాన్స్‌ ఈసారి ఎలాగైనా టైటిల్‌ సాధించాలన్న పట్టుదలతో ఉంది. తమిళ్‌ తలైవా్‌సతో జరిగే తొలి మ్యాచ్‌లో విజయంతో బోణీ చేయాలనుకుంటోంది. అనుభవజ్ఞుడైన రోహిత్‌ కుమార్‌ కెప్టెన్‌ గా ఉండటం టైటాన్స్‌ కు కలిసివచ్చే అంశం. తెలుగు ఆటగాళ్లు పల్లా రామకృష్ణ (ఆంధ్రప్రదేశ్‌), గల్లా రాజు (తెలంగాణ)కు టీమ్‌లో చోటుదక్కింది. సురీందర్‌ సింగ్‌, సందీప్‌ ఖండోలా, రుతురాజ్‌తో డిఫెన్స్‌ బలంగానే కనిపిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =