ఆయుధ సంపత్తి పెంచుకుంటున్న భారత్ – ప్రళయ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

Ballistic Missile Pralay, India Successfully Test Fired Short Range Ballistic Missile Pralay, India successfully test fires Pralay ballistic missile, India successfully tests ballistic missile Pralay, India successfully tests Pralay missile off Odisha coast, India successfully tests short-range ballistic, India successfully tests short-range ballistic missile, Mango News, Mango News Telugu, Missile, Missile Pralay, Pralay, Pralay missile successfully test-fired, Short Range Ballistic Missile Pralay

‘ప్రళయ్‌’ భారత్ అమ్ముల పొదిలో చేరిన మరో అద్భుత అస్త్రం. ఈ బాలిస్టిక్ క్షిపణి పరీక్షను డీఆర్‌డీవో బుధవారం విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా లోని బాలాసోర్‌ కేంద్రం వద్ద ఈ మిస్సైల్‌ పరీక్ష నిర్వహించారు. 150 నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఈ క్షిపణి చేధిస్తుందని డీఆర్‌డీవో తెలిపింది. దీనిని భూతలం నుంచి భూతలంపై ఉన్న లక్ష్యంపై ప్రయోగించే అవకాశం ఉంటుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణి 500-1,000 కిలోల పేలోడ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. DRDO తయారు చేసిన యుద్ధభూమి క్షిపణి ఈ ‘ప్రళయ్‌’.

‘ప్రళయ్‌’ భారతీయ బాలిస్టిక్ క్షిపణి ప్రోగ్రాం పృథ్వీ డిఫెన్స్ వెహికల్ ఆధారంగా రూపొందించబడింది. బుధవారం ఉదయం 10.30 గంటలకు ఏపీజే అబ్దుల్ కలాం సెంటర్ నుంచి ‘ప్రళయ్’ క్షిపణిని ప్రయోగించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ DRDO ని అభినందించారు. ఉపరితల క్షిపణిని వేగంగా అభివృద్ధి చేసి విజయవంతంగా ప్రయోగించినందుకు DRDO ను ఆయన కొనియాడారు. ఈ క్షిపణి ఆధునిక సాంకేతికతలతో కూడిన కొత్త తరం ఉపరితల క్షిపణి అని తెలిపారు. ఈ ఆయుధ వ్యవస్థ ఇండక్షన్ సాయుధ దళాలకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఆయన అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =