పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కీలక నిర్ణయం.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 100 ఆమ్ ఆద్మీ క్లినిక్‌లు ప్రారంభం

Punjab CM Bhagwant Mann To Dedicate 100 Aam Aadmi Clinics To People on Independence Day, Bhagwant Mann To Dedicate 100 Aam Aadmi Clinics To People on Independence Day, 100 Aam Aadmi Clinics To People on Independence Day, 100 Aam Aadmi Clinics, Independence Day, 75th Independence Day, Independence Day Celebrations, Punjab CM Bhagwant Mann, CM Bhagwant Mann, Aam Aadmi Clinics News, Aam Aadmi Clinics Latest News And Updates, Aam Aadmi Clinics Live Updates, Mango News, Mango News Telugu,

పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పంజాబ్‌లో 100 ‘ఆమ్ ఆద్మీ క్లినిక్‌’లను ప్రారంభించి ప్రజలకు అంకితం చేయనున్నారు. ఈ మేరకు ఆరోగ్య మంత్రి చేతన్ సింగ్ జౌరమజ్రా శుక్రవారం ప్రకటించారు. సామాన్యులకు అత్యున్నతమైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధత నెరవేరేందుకు ఇది తొలి అడుగు అని ఆయన తెలిపారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కింద రాష్ట్రంలోని 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘ఆమ్ ఆద్మీ క్లినిక్‌లు’ సేవలందిస్తాయని మంత్రి వెల్లడించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో ఈ క్లినిక్‌లను ప్రారంభించటానికి భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను (75వ స్వాతంత్య్ర దినోత్సవం) పురస్కరించుకుని ముందుగా 75 క్లినిక్‌లను ప్రారంభించటానికి ప్రణాళికలు వేసిన ప్రభుత్వం ఆ తర్వాత సంఖ్యను 100కి పెంచారు. త్వరలోనే మిగిలిన నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ క్లినిక్‌లను ఏర్పాటు చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 1 =