ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌?

Punjab Ex-CM Amarinder Singh Likely To be NDA's Vice Presidential Candidate, Ex-CM Amarinder Singh Likely To be NDA's Vice Presidential Candidate, Amarinder Singh Likely To be NDA's Vice Presidential Candidate, Punjab Former CM Amarinder Singh Likely To be NDA's Vice Presidential Candidate, Former CM Amarinder Singh Likely To be NDA's Vice Presidential Candidate, NDA's Vice Presidential Candidate, Vice Presidential Candidate, vice-presidential elections, election for India's 16th vice president will take place on August 6, National Defence Academy, National Defence Academy Vice Presidential Candidate, Punjab Former CM Amarinder Singh, CM Amarinder Singh, vice-presidential elections News, vice-presidential elections Latest News, vice-presidential elections Latest Updates, vice-presidential elections Live Updates, Mango News, Mango News Telugu,

రాష్ట్రపతి పదవికి గిరిజన నేత ద్రౌపది ముర్ముని ప్రకటించిన బీజేపీ తాజాగా ఉపరాష్ట్రపతి పదవిపై దృష్టి సారించింది. ఎన్‌డీఏ పక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌ను నిలబెట్టాలని భావిస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు పంజాబ్ సీనియర్ బిజెపి నాయకుడు హర్జీ సింగ్ గ్రేవాల్ శనివారం పేర్కొన్నారు. అలాగే దీనిపై అమరీందర్‌ కార్యాలయం కూడా మీడియాకు తెలిపింది. త్వరలో ఆయన తన పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్‌ను బీజేపీలో విలీనం చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే కెప్టెన్ అమరీందర్ సింగ్ ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 80 ఏళ్ల అమరీందర్ సింగ్ ప్రస్తుతం వెన్ను శస్త్రచికిత్స కోసం లండన్‌లో ఉన్నారు. అయితే నామినేషన్ పత్రాల దాఖలుకు జూలై 19 చివరి రోజు కాగా, ఆగస్టు 6న ఎన్నికలు జరగనున్నాయి. ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఆగస్టు 10న పదవీ విరమణ చేయడానికి నాలుగు రోజుల ముందు ఎన్నికలు జరగనున్నాయి. అమరీందర్ పంజాబ్ లో ఎన్నో ఎల్లా పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. అనంతరం అధిష్టానంతో విభేదాలతో పార్టీని వీడి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో ఆయన పార్టీ ప్రభావం చూపించలేదు. అప్పటినుంచి ప్రత్యక్ష రాజకీయాలలో అంతగా ఉత్సాహం చూపని ఆయన తాజాగా వెలువడిన నోటిఫికేషన్ తర్వాత వైస్‌ ప్రెసిడెంట్‌గా నిలబడాలని భావిస్తున్నట్లు ఆయన అంతరంగికులు వెల్లడించారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం రానుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =