ముంబయి ఇండియన్స్‌ తో ఢిల్లీ క్యాపిటల్స్ డీ, కాసేపట్లో ఐపీఎల్-2020 ఫైనల్

IPL 2020 Final Today: Mumbai Indians vs Delhi Capitals

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2020 లో చివరి పోరాటం మరికాసేపట్లో మొదలవనుంది. ఐపీఎల్ ఫైనల్లో ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకు ముంబయి ఇండియన్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. క్వాలిఫయర్‌-1 మ్యాచ్ లో నెగ్గి ముంబయి ఇండియన్స్ ఆరోసారి ఐపీఎల్ ఫైనల్ కు చేరుకోగా, క్వాలిఫయర్-2 లో ఘనవిజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలిసారిగా ఐపీఎల్ ఫైనల్ కు చేరుకుంది. ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించి ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోవాలని ముంబయి జట్టు ఉవ్విళూరుతుండగా, మరోవైపు ఈ సీజన్ మొత్తం నిలకడగా రాణిస్తున్న ఢిల్లీ జట్టు ఎలాగైనా ఐపీఎల్ ట్రోఫీని తన ఖాతాలో వేసుకునేందుకు అన్ని అస్త్రాలతో సిద్దమవుతుంది.

ముంబయి జట్టులో ఈ సీజన్ మొదటినుంచి క్వింటన్‌ డికాక్‌, సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్‌ పాండ్య, కీరన్ పొలార్డ్‌, కృనాల్ పాండ్యా బ్యాటింగ్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్, చాహర్ అంచనాలకు తగ్గట్టు రాణిస్తున్నారు. ‌ఇక ఓపెనర్ శిఖర్ ధావన్ అద్భుతమైన ఫామ్ లో ఉండడం ఢిల్లీ జట్టుకు కలిసివస్తుంది. ఐపీఎల్ ట్రోఫీ కైవసం చేసుకోవాలంటే  స్టోయినిస్, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్ సామర్ధ్యం మేర రాణించాల్సి ఉంటుంది. అలాగే ఢిల్లీ విజయాల్లో ప్రధానంగా నిలుస్తున్న బౌలర్లు కగిసో రబాడ, ఎన్రిచ్‌ నోర్జే, అశ్విన్, ఆక్సర్ పటేల్ మరోమారు తమ సత్తా చాటాలి. ఐపీఎల్-2020 విజేతగా ముంబయి, ఢిల్లీలలో ఎవరు నిలవనున్నారో మరికొద్ది గంటల్లో తేలనుంది.

ముంబయి ఇండియన్స్ ప్రాబబుల్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కీరోన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్-నైలు, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా.

ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాబబుల్ జట్టు: శిఖర్ ధావన్, మార్కస్ స్టోయినిస్, అజింక్య రహానె, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, షిమ్రాన్ హెట్మర్, ఆక్సర్ పటేల్, అశ్విన్, కగిసో రబాడా, అన్రిచ్ నార్ట్జే, ప్రవీణ్ దూబే/హర్షల్ పటేల్.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =