హుజూరాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత.. బహిరంగ చర్చకు వచ్చిన ఎమ్మెల్సీ కౌశిక్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌-బీజేపీ శ్రేణుల బాహాబాహీ

Huzurabad MLC Kaushik Reddy Challenges Open Discussion with MLA Etela Clashes Between TRS and BJP, MLC Padi Kaushik Reddy challenged BJP MLA Eatala Rajender to a public debate, Huzurabad MLC Kaushik Reddy Challenges Open Discussion with MLA Eatala Rajender, TRS MLC Kaushik Reddy invites Eatala Rajender to debate, Kaushik Reddy Challenges Open Discussion with MLA Etela, Clashes Between TRS and BJP, war atmosphere between TRS and BJP, Huzurabad MLC Kaushik Reddy, MLC Kaushik Reddy, Kaushik Reddy, BJP MLA Eatala Rajender, MLA Eatala Rajender, Eatala Rajender, Clashes Between TRS and BJP News, Clashes Between TRS and BJP Latest News, Clashes Between TRS and BJP Latest Updates, Clashes Between TRS and BJP Live Updates, Mango News, Mango News Telugu,

హుజురాబాద్‌లో శుక్రవారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. హుజూరాబాద్ నియోజకవర్గం అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలంటూ ఆ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను అధికార పార్టీ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సవాల్ చేసిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలో అంబేద్కర్ కూడలి దగ్గర ఒక వేదిక ఏర్పాటు చేసి దాని మీద టీఆర్ఎస్ నేతలు రెండు కుర్చీలు కూడా వేశారు. అలాగే అంబేద్కర్ కూడలి చుట్టూ టీఆర్‌ఎస్ కార్యకర్తలు తమ పార్టీ జెండాలను ఉంచారు.

దీనిపై అసహనం వ్యక్తం చేసిన బీజేపీ కార్యకర్తలు కొందరు అదే స్థలంలో తమ పార్టీ జెండాలను ఉంచారు. జెండాల విషయమై ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇక ఇదే సమయంలో ఎమ్మెల్సీ కౌశిక్‌ రెడ్డి అంబేద్కర్ చౌక్ దగ్గరకు చేరుకోగా, ఆయన వచ్చిన కొద్దిసేపటికే బీజేపీ శ్రేణులు భారీగా చేరుకోవడంతో ఒక్కసారిగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలనూ చెదరగొట్టారు. కాగా ఇదే విషయమై గురువారం కూడా ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడం గమనార్హం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here