టీ20 ప్రపంచకప్‌-2022: ఐసీసీ ‘మోస్ట్ వాల్యూబుల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ లో కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్

ICC Announces Most Valuable Team of the T20 World Cup 2022 Kohli Suryakumar Yadav Gets Place, ICC Announces Most Valuable Team, T20 World Cup 2022, Most Valuable Team Kohli, Most Valuable Team Suryakumar Yadav,Mango News,Mango News Telugu,Virat Kohli,Suryakumar Yadav,ICC Most Valuable Team, Most Valuable Team Virat Kohli,Most Valuable Team Suryakumar Yadav, Suryakumar Yadav Latest News And Updates,Virat Kohli News And Live updates,ICC News And Updates

ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ 2022 ఘనంగా ముగిసింది. అత్యుత్తమ ప్రదర్శనతో ఇంగ్లాండ్ జట్టు ఫైనల్లో పాకిస్తాన్ పై ఘనవిజయం సాధించి టీ20 ప్రపంచకప్‌ 2022 టైటిల్ ను కైవసం చేసుకుంది. కాగా ఫైనల్‌లో పాకిస్తాన్‌పై ఇంగ్లాండ్ విజయం సాధించిన అనంతరం, ‘మోస్ట్ వాల్యూబుల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. ఈ టీమ్ లో టీమిండియా స్టార్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ స్థానం దక్కించుకున్నారు. అలాగే ఇంగ్లాండ్ జట్టు నుంచి నలుగురు, పాకిస్తాన్ జట్టు నుంచి ఇద్దరు, న్యూజిలాండ్ నుంచి ఒకరు, సౌతాఫ్రికా నుంచి ఒకరు, జింబాంబ్వే నుంచి ఒక ఆటగాడు చోటు దక్కించుకున్నారు. ఇక ఈ టోర్నమెంట్ లో రాణించిన భారత్ ఆల్‌రౌండ్ హార్దిక్ పాండ్యాను 12వ ఆటగాడిగా ప్రకటించారు.

విరాట్ కోహ్లీ ఈ టీ20 ప్రపంచ కప్‌లో 98.66 సగటుతో 296 పరుగులు చేసి, అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. సూపర్-12లో పాకిస్థాన్‌పై 82* పరుగుల అద్భుత నాక్‌తో సహా నాలుగు అర్ధసెంచరీలు చేశాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ ఈ టోర్నమెంట్ మొత్తం తన దూకుడు బ్యాటింగ్ శైలితో అందరినీ అలరించాడు, 189.68 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో 239 పరుగులు చేశాడు.

టీ20 ప్రపంచకప్-2022 – ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్:

1. అలెక్స్ హేల్స్ (ఇంగ్లాండ్)
2. జోస్ బట్లర్ (ఇంగ్లాండ్)
3. విరాట్ కోహ్లీ (భారత్)
4. సూర్యకుమార్ యాదవ్ (భారత్)
5. గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్)
6. సికందర్ రజా (జింబాంబ్వే)
7. షాదాబ్ ఖాన్ (పాకిస్తాన్)
8. సామ్ కుర్రాన్ (ఇంగ్లాండ్)
9. అన్రిచ్ నోర్ట్జే (సౌతాఫ్రికా)
10. మార్క్ వుడ్ (ఇంగ్లాండ్)
11. షాహీన్ అఫ్రిది (పాకిస్తాన్).

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 6 =