అదానీ గ్రూప్‌ వ్యవహారంపై ఆర్బీఐ దృష్టి.. రుణాల వివరాలు తెలియజేయాలని అన్ని బ్యాంకులకు ఆదేశాలు?

RBI Asks All Indian Banks For The Details of Exposure To Adani Group Companies,RBI Asks All Indian Banks,Details of Exposure,Adani Group Companies,Mango News,Mango News Telugu,Adani Gas Share Price,Adani Career,Adani Cement,Adani Electricity,Adani Electricity Bill,Adani Electricity Bill Payment,Adani Enterprises,Adani Enterprises Share Price,Adani Gas,Adani Green Share Price,Adani One,Adani Port Share Price,Adani Power,Adani Power Share Price,Adani Wilmar Share Price,Gautam Adani,Gautam Adani Net Worth

గడచిన నాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయిన అదానీ గ్రూప్‌ వ్యవహారంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్‌ కంపెనీలకు సంబంధించిన రుణాల వివరాలు సమర్పించాలని కోరుతూ దేశంలోని అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీనిని పలు బ్యాంకులు ధ్రువీకరించాయి. కాగా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు మార్కెట్ వాల్యుయేషన్‌లో దాదాపు 100 బిలియన్ డాలర్ల మేర నష్టపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ క్రమంలో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ఎఫ్‌పిఓ (ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్) తో ముందుకు సాగకూడదని నిర్ణయించుకోవడంతో గురువారం షేర్లు మరింతగా పడిపోయాయి.

ఈ నేపథ్యంలో పెట్టుబడిదారుల్లో ఆందోళనను తగ్గించేందుకు ఓ వీడియో స్టేట్‌మెంట్‌ను ఆయన విడుదల చేశారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 8 శాతం మేరకు విలువను కోల్పోగా.. అదానీ పోర్ట్స్, ఎస్ఈజెడ్ 3 శాతానికి పైగా పతనమయ్యాయి. అలాగే గ్రూప్ లోని మిగిలిన కంపెనీలు అదానీ విల్మర్, అదానీ పవర్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్ భారీగా పతనమై లోయర్ సర్క్యూట్స్‌ను తాకాయి. కానీ అంబుజ మరియు ఏసీసీ మాత్రం 1-5 శాతం మేరకు పెరగడం విశేషం. కాగా అమెరికన్ షార్ట్ సెల్లర్ సంస్థ ‘హిండెన్‌బర్గ్’ అదానీ గ్రూప్‌ కంపనీలపై గత వారం విడుదల ఒక సంచలన నివేదికను వెల్లడించింది. అందులో అదానీ గ్రూప్ కంపెనీలలో స్టాక్ మేనిప్యులేషన్ జరుగుతోందని తెలిపింది. అలాగే పన్నుల చెల్లింపులో అక్రమాలకు పాల్పడుతోందని, అంతేకాకుండా గ్రూప్‌ కంపనీల అప్పులు స్థాయిని మించి ఉన్నాయని పేర్కొంది. ఈ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ దారుణ పతనాన్ని చవిచూస్తోంది. ఇక ఇదిలా ఉండగా దీనిపై ఈరోజు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేకంగా చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 9 =