ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు పెంపు, పెరగనున్న లోన్ ఈఎంఐలు

RBI Monetary Policy 2023 Repo Rate Hiked by 25 Basis Points to Reached 6.50% Loan EMIs Likely to Go up,RBI Monetary Policy 2023,Repo Rate Hiked by 25 Basis,Reached 6.50% Loan EMIs,Mango News,Mango News Telugu,Rbi Regional Office Jaipur,Rbi Regional Office Hyderabad,Rbi Regional Office Delhi,Rbi Regional Office Chennai,Rbi Regional Office Chandigarh,Rbi Regional Office Bangalore,Rbi Regional Office Ahmedabad,Rbi Office Near Me,Rbi Office In Visakhapatnam,Rbi Interest Rate For Senior Citizens,Rbi Hyderabad Staff List,Rbi Hyderabad Contact Number,Rbi Hyderabad Address,Rbi Holiday In Rajasthan,Rbi Head Office,Rbi Fed Mumbai Regional Office,Rbi Customer Support,Rbi Customer Care,Rbi Chennai Regional Office Address,Rbi Branches,Rbi Bangalore Regional Office Address,Rbi Ahmedabad Regional Office Address,List Of Rbi Banks In India,4 Sub Offices Of Rbi,27 Regional Offices Of Rbi

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి వడ్డీ రేట్లను పెంచింది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీ సోమవారం ద్వైమాసిక పాలసీ సమీక్షపై చర్చలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు దీనికి సంబంధించిన వివరాలను గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఈ సందర్భంగా ద్రవ్య విధాన కమిటీలోని ఆరుగురు సభ్యుల్లో నలుగురు వడ్డీరేట్ల పెంపునకు అనుకూలంగా ఓటు వేశారని ఆయన తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మార్పులు, అభివృద్ధి చెందిన దేశాల్లో అధిక ద్రవ్యోల్బణం వంటి పరిణామాలు భారత ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపుతాయని, దీనికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు.

దీని ప్రకారం.. రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు పెరిగి మొత్తం 6.5 శాతానికి చేరింది. కాగా ఈ రెపో అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాణిజ్య బ్యాంకులకు అవసరమైనప్పుడు రుణాలు ఇచ్చే రేటు. ఇది ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి సెంట్రల్ బ్యాంక్ ఉపయోగించే సాధనం. ఇక 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి ఇది మూడవ పెంపు కావడం విశేషం. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇదే చివరి పెంపు. తాజా పెంపుతో కలిపి, ఈ ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్‌ బ్యాంక్‌ రెపో రేటును మొత్తం 225 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది. ఇక రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం తదనంతర పరిస్థితుల నేపథ్యంలో, 2022 మే నెల నుంచి రెపో రేటు పెంపును ప్రారంభించింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో లెండింగ్‌ రేట్లను ఆర్బీఐ పెంచడం ఇది వరుసగా ఆరోసారి.

అసలు రెపో రేటు అంటే ఏంటి?

దేశంలోని వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఇచ్చే రుణం మీద విధించే వడ్డీ రేటునే రెపో రేటు అంటారు. ఈ రెపో రేటు పెరిగితే.. అనులోమానుపాతంలో ఆర్బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాల మీద వడ్డీ భారం పెరుగుతుంది. దీంతో ప్రజలు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలకు తాము ఇచ్చే రుణాల మీద వడ్డీ రేట్లను పెంచడం ద్వారా రెపో రేటు భారాన్ని బ్యాంకులు అధికశాతం మేర తగ్గించుకుంటాయి. అంతిమంగా రెపో రేటు పెరిగితే, బ్యాంకులు ఇచ్చే రుణాల మీద వడ్డీ రేట్లు ఆటోమేటిక్ గా పెరుగుతాయి. చివరకు ఆ భారం ప్రజల మీద ప్రభావం పడుతుంది. కాగా ఆర్బీఐ తాజా నిర్ణయం మేరకు బ్యాంకులు త్వరలోనే వడ్డీ రేట్ల పెంపును ప్రకటించే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + twelve =