రేపు కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ హాజరు

Mallikarjun Kharge will Take Charge as Congress National President on October 26th, Mallikarjun Kharge Charge as Congress National President , Congress President Election, Congress National President Mallikarjun Kharge , Congress National President, Mallikarjun Kharge Congress Presidential Elections, Mallikarjun Kharge Congress President , Mango News, Mango News Telugu, Former Congress President Sonia Gandhi, Shashi Tharoor , Sonia Gandhi, Sonia Gandhi News, Congress Presidential Election, Rahul Gandhi Bharat Jodo Yatra

కాంగ్రెస్ పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ఇటీవలే ఎన్నికయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు (అక్టోబర్ 26, బుధవారం) కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే ప్రమాణస్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించనున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రేపు ఉదయం 10 గంటల నుంచి జరిగే అధ్యక్ష బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, పార్టీ సీనియర్ నేతలు, సీడబ్ల్యూసీ మెంబర్స్, పార్టీ జాతీయ సంస్థ ప్రధాన కార్యదర్శులు, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర బాఘేల్‌, అన్ని రాష్ట్రాల పీసీసీ ప్రెసిడెంట్స్, వర్కింగ్ ప్రెసిడెంట్స్, సీఎల్పీ నాయకులతో పాటుగా అన్ని రాష్ట్రాల నుంచి పలువురు కీలక నేతలు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.

ముందుగా అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఎన్నికలు జరగగా, అక్టోబర్ 19న కౌంటింగ్‌ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తన ప్రత్యర్థి, కాంగ్రెస్ లోక్ సభ ఎంపీ శశి థరూర్ పై 6825 ఓట్ల తేడాతో మల్లికార్జున్ ఖర్గే ఘనవిజయం సాధించి, కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 9,835 ఓట్లు పోల్ అవగా, మల్లిఖార్జున్ ఖర్గేకు 7,897 ఓట్లు రాగా, శశిథరూర్‌కు 1,072 ఓట్లు వచ్చాయి. 416 ఓట్లు చెల్లలేదని పార్టీ ఎన్నికల విభాగం రిటర్నింగ్ ఆఫీసర్ మధుసూదన్ మిస్త్రీ వెల్లడించారు. మెజారిటీ ఓట్లు సాధించిన మల్లికార్జున్ ఖర్గే ను కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ప్రకటిస్తున్నట్టు మధుసూదన్ మిస్త్రీ పేర్కొన్నారు. పార్టీలో 24 ఏళ్లకి సీతారామ్ కేస‌రి తర్వాత మళ్ళీ నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి అయిన మల్లిఖార్జున్ ఖార్గే పార్టీ అధినేతగా ఎన్నికయ్యారు. అలాగే జగ్జీవన్ రామ్ తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టిన రెండో దళిత నేతగా మరియు నిజలింగప్ప తర్వాత కర్ణాటక నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎన్నికైన రెండో నేతగా ఖర్గే గుర్తింపు పొందారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + three =