రేపు నాగోల్ ఫ్లైఓవర్‌ ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

Minister KTR to Inaugurate 990m Nagole Flyover Built under SRDP on Oct 26, Nagole Flyover Opening, Nagole Flyover Inaguration, Nagole Flyover, Mango News, Mango News Telugu, KTR Nagole Flyover Openingm, 990m Nagole Flyover, KTR to Inaugurate 990m Nagole Flyover,Nagole Flyover Built under SRDP, Nagole Flyover Opening on Oct 26, Minister KTR Latest News And Updates, Nagole Flyover News And Live Updates, Telangana Minister KTR

హైదరాబాద్ నగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ఎస్‌.ఆర్‌.డి.పిలో భాగంగా రూ.143.58 కోట్ల వ్య‌యంతో 990 మీటర్ల పొడవున నిర్మించిన నాగోల్ ఫ్లైఓవర్‌ను రేపు (అక్టోబర్ 26, బుధవారం) రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ టూ వే ఫ్లైఓవర్‌లో 6 లేన్ క్యారేజ్‌వే ఉంది. అలాగే ఉప్పల్ నుండి ఎల్బీనగర్ వరకు సిగ్నల్ ఫ్రీ డ్రైవ్‌ ఏర్పడడంతో పాటుగా, ఆ ప్రాంత పరిధిలో ప్రజలకు ట్రాఫిక్‌ సమస్యలు తీరనున్నాయి.

ఎస్‌ఆర్‌డీపీ కింద నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లను జీహెఛ్ఎంసీ, ప్రభుత్వం సంయుక్తంగా నిర్మించి, అందుబాటులోకి తెస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎస్‌ఆర్‌డీపీ కింద చేపట్టిన నాగోల్‌ ఫ్లై ఓవర్‌ పనులు పూర్తి కావడంతో రేపు అధికారికంగా ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఫ్లైఓవర్ తో ఎల్బీనగర్‌ నుంచి ఉప్పల్‌ మరియు ఉప్పల్‌ నుంచి ఎల్బీనగర్ మరియు ఆయా ప్రాంతాల నుంచే కనెక్టింగ్ జిల్లాలకు వెళ్లే సమయంలో ట్రాఫిక్ సమస్య లేకుండా సులభంగా రాకపోకలు సాగించవచ్చు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =