బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆర్జేడీకి భారీ షాక్‌

Lalu Prasad Yadav, national news, national political updates, Raghuvansh Prasad Resigns, RJD Senior Leader, RJD Senior Leader Raghuvansh Prasad Resigns, RJD Senior Leader Raghuvansh Prasad Resigns to Party, RJD Senior Leader Raghuvansh Prasad Sends Letter to Lalu Prasad Yadav

బీహార్ రాష్ట్రంలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీహార్ లో కీలక పార్టీ అయిన రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ)కు భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి రఘువంశ్ ప్రసాద్‌ సింగ్ ఈ రోజు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆర్జేడీ పార్టీ అధినేత‌ లాలూప్రసాద్‌ యాదవ్‌కు పంపించారు. ఆయన గతంలోనే పార్టీ ఉపాధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. పార్టీలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలోనే రఘువంశ్ ప్రసాద్‌ సింగ్ రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. ఈ అసెంబ్లీ ఎన్నికలు ఆర్జేడీకి కీలకంగా మారిన సమయంలో రఘువంశ్ ప్రసాద్‌ సింగ్ రాజీనామా ఆ పార్టీకి భారీ ఎదురుదెబ్బగా మారే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఎన్డీయే(జేడియూ-బీజేపీ) కూటమిలో ఆయన త్వరలోనే చేరుతారనే ప్రచారం జరుగుతుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here